Home » ఫ్రీ బస్ ఎఫెక్ట్.. జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్న మహిళలు..!

ఫ్రీ బస్ ఎఫెక్ట్.. జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్న మహిళలు..!

by Anji
Ad

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానంగా 6 గ్యారెంటీ స్కీమ్ లు అని దాదాపు అందరికీ తెలిసిందే. ఆ ఆరు గ్యారెంటీ స్కీమ్ లలో భాగంగా ఇప్పటికే  ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. అయితే ఈ బస్సుల్లో పురుషులకు సీట్లు లభించడం లేదు. ముఖ్యంగా స్త్రీలు ఎక్కడికి వెళ్లాలన్న బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. ప్రభుత్వం మహిళలకు తీసుకొచ్చిన ఫ్రీ బస్సు సౌకర్యం కొట్లాటలకు దారిస్తుంది.

Advertisement

సీట్ల కోసం మహిళలు కొన్ని సందర్భాల్లో ఒకరినొకరు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ప్రతి రోజు పలు చోట్ల ఇలాంటి ఘటనలు ఎక్కడొక చోట చూస్తునే ఉన్నాము. తాజాగా జహీరాబాద్ నుండి సంగారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం ఇద్దరు మహిళలు దారుణంగా కొట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో లో వైరల్ గా మారింది.బస్సు, రైళ్లలో సీట్ల కోసం గొడవలు పడటం సహజం. ఒకరిని మరొకరు తోసుకోవడం ఇంకా ఎక్కువ అయితే కొట్టుకోవడం చాలానే జరుగుతుంటాయి. అయితే, ఇప్పుడు తెలంగాణ లో ఫ్రీ బస్సు సౌకర్యం వచ్చిన దగ్గరి నుండి ఆర్టీసీ బస్సుల్లో మాటల యుద్ధాలు కాదు ఏకంగా జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్న ఘటనలు ఎక్కువుతున్నాయి.

Advertisement

కొన్నిసార్లు ఆ చిన్న గొడవలు కాస్తో కొట్టుకునే స్థాయికి చేరుతున్నాయి. ఒకరిపై మరొకరు తిట్టుకుంటూ దాడులకు దిగుతున్నారు. ఎవరైనా సర్ధి చెప్పడానికి అడ్డొచ్చిన.. వారిని కూడా వదలడం లేదు.తాజాగా జహీరాబాద్ నుండి సంగారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సులో ఇదే గొడవ జరిగింది. సీటు విషయంలో ఇద్దరు మహిళలు భీబత్సంగా కొట్టుకున్నారు. ఒకరినొకరు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. తోటి ప్రయాణికులు ఆపే ప్రయత్నం చేసినప్పటికీ వారు ఏమాత్రం తగ్గకుండా నువ్వా..నేనా అనట్టు కొట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబదించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

మరిన్ని  తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading