మన భారతదేశంలో వాస్తు శాస్త్రాలను ఎక్కువగా నమ్ముతాం. చిన్న రాయి నుండి చెట్టు వరకు పూజిస్తాం. ముఖ్యంగా వాస్తు శాస్త్రాన్ని బట్టి మనం అనేక పనులు చేస్తాం. అయితే మహిళలు ఈ పనులు చేస్తే ఇంట్లో అష్టదరిద్రమే. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వివాహితులు అయిన స్త్రీలు ఇంట్లో చేయకూడని పనుల విషయానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయంలో గాజులు, కమ్మలు, మంగళసూత్రాలు తీయకూడదు. వీరు ఒకరు ధరించిన పూలు మరొకరు పెట్టుకోకూడదు.
Also Read: కలలో చనిపోయిన పూర్వీకులు కనిపిస్తున్నారా, కోటీశ్వరులు అవుతారా!
Advertisement
మంగళవారం నాడు భర్త, పిల్లలు ఎవరు క్షవరం కానీ, గడ్డం కానీ చేసుకోవడం మంచిది కాదని చెప్పి నిలువరించాలి. అలా చేస్తే దరిద్రం వస్తుందన్న విషయాన్ని స్త్రీలు చెప్పాలి. ఇక ఇంట్లో చేసే మంచి పనులను శుక్లపక్షంలోనే చేయాలి. అంటే అమావాస్య నుండి పౌర్ణమి వచ్చేవరకు వచ్చే రోజులలోనే మంచి పనులు చేయాలి. స్త్రీలు పొరపాటున వారు కానీ, పిల్లలు కానీ దిండుపై కూర్చోకూడదు. నలుపు రంగు వస్తువులను ఇంట్లో పెట్టుకోకూడదు. స్త్రీలు నల్లటి వస్త్రాలను ధరించకూడదు. ఉప్పు, మిరప, చింతపండు వీటిని ఎవరికి ఇచ్చినా చేతితో ఇవ్వకూడదు. పక్కన పెడితే వాళ్లే తీసుకుంటారు.
Advertisement
స్త్రీలు ఎప్పుడు జుట్టు విరబోసుకుని ఉండకూడదు. అలా ఉంటే ఇంట్లో జేష్ఠ దేవి వచ్చి కూర్చుంటుంది. శుక్రవారం నాడు కానీ జీతం వచ్చిన రోజు కానీ ఆ డబ్బులతో మొదటి సారి ఉప్పు కొనుగోలు చేస్తే డబ్బులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుందని, ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉంటుందని గుర్తుంచుకోవాలి. అంతేకాదు స్త్రీలు కాలుపై కాలు వేసుకుని కూర్చోవడం, కాళ్లు ఊపుతూ కూర్చోవడం, స్థిరంగా నిలబడకుండా డాన్స్ చేస్తున్నట్టుగా తిరుగుతూ ఉండటం వంటి పనులు చేయకూడదు. పెళ్లైన స్త్రీలు రాత్రి వేళల్లో భోజనం చేయకుండా అలగకూడదు. ఆహారం తినకుండా నిద్రించకూడదు.
READ ALSO : Singer Mangli: సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి.. కారణం అదే!