Telugu News » Blog » కలలో చనిపోయిన పూర్వీకులు పదే పదే కనిపిస్తున్నారా అయితే దాని అర్థం ఇదే !

కలలో చనిపోయిన పూర్వీకులు పదే పదే కనిపిస్తున్నారా అయితే దాని అర్థం ఇదే !

by Bunty
Published: Last Updated on
Ads

సాధారణంగా నిద్రపోయిన సమయంలో మన కుటుంబసభ్యులు కానీ, బంధుమిత్రులు, లేదంటే ఇతర స్నేహితులు చనిపోయినవారు అప్పుడప్పుడు కలలో కనిపిస్తూ ఉంటారు. దీంతో ఒక్కసారిగా నిద్రపోయిన వారు భయాందోళనలకు గురవుతూ ఉంటారు. అయితే చనిపోయిన వారు కలలో కనిపించడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయట. కలల శాస్త్రం ప్రకారం వారు మన కలలో కనిపిస్తున్నారు అంటే వారి యొక్క ఆత్మ ఈ లోకంలో సంచరిస్తుందని అర్థం చేసుకోవాలి.

Advertisement

అయితే ఈ చనిపోయిన వారి ఆత్మలు మన కలలో కనిపించినప్పుడు కొన్ని నియమాలను పాటించాలని, దీనివల్ల శుభ ఫలితాలు పొందవచ్చని స్వప్న శాస్త్ర నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా చనిపోయిన వ్యక్తులు తరచూ కలలో కనిపించినట్టయితే రామాయణ, భగవద్గీత పురాణాలను చదవాలి. ఒకవేళ వారు ఎంతో బాధతో ఏమీ మాట్లాడకుండా మన కలలో కనిపిస్తే మీరు ఏదో తప్పు చేయబోతున్నారని సంకేతమట. అదే విధంగా మన చనిపోయిన బంధువులు ఆకలితో కనబడితే వెంటనే పేదవారికి అన్నదానం చేయాలి. దీని వల్ల మన బంధువుల ఆత్మ సంతోషపడుతుంది.

Advertisement

Advertisement

ఒకవేళ చనిపోయిన వ్యక్తులు కోపంతో మీ కలలో కనిపిస్తే వారు మీ నుంచి ఏదో ఆశిస్తున్నారని అర్థం. ఒక్కసారి చనిపోయిన మన కుటుంబీకులు సంతోషంగా కలలో కనిపిస్తూ ఉంటారు. వారు అలా సంతోషంగా, నవ్వుతూ కనిపించడం వల్ల మనకు శుభపరిణామాలు జరగబోతున్నాయని స్వప్న శాస్త్ర నిపుణులు అంటున్నారు. కొంతమంది తీరని కోరికతో మరణిస్తారు. అలాంటివారు మన కలలో కనిపించి ఇలా చేయమని సలహా ఇచ్చినట్లయితే, వారు చెప్పిన దాని ప్రకారం మనం చేస్తే వారి ఆత్మ సంతృప్తి చెందుతుందని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

READ ALSO : Kantara 2 : కాంతార ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, త్వరలో ‘కాంతార 2’