Telugu News » అక్కడ వింత ఆచారం..భార్య‌ను అద్దెకు తీసుకోవ‌చ్చు

అక్కడ వింత ఆచారం..భార్య‌ను అద్దెకు తీసుకోవ‌చ్చు

by Sravan Sunku
Published: Last Updated on
Ad

భార‌త‌దేశం అంటే సంప్ర‌దాయాల‌కు నిల‌యం. అలాంటి దేశంలో ఓ వింత ఆచారం ఉన్న‌ద‌నే విష‌యం ఇప్ప‌టివ‌ర‌కు చాలా మందికి తెలియ‌దు. భార్యను వదిలేసే వాళ్లను చాలా మందిని చూసి ఉంటాం మ‌నం. అదేవిధంగా మరో దేశానికి తీసుకుపోయి అమ్మేసే వాళ్లను కూడ‌ చూశాం. కానీ కట్టుకున్న భార్యను అద్దెకిచ్చే వాళ్లను ఎప్పుడైనా చూసారా..? ఇది నిజం అండి ఇలాంటి బ్యాచ్ కూడ ఒక‌టి ఉన్న‌ది. వీరు ఎంచ‌క్క‌గా త‌మ భార్య‌ల‌ను అద్దెకు ఇస్తుంటారు. కొన్నాళ్ల పాటు అద్దెకు ఇచ్చిన భార్య‌తో అద్దెకు తీసుకున్న‌ వ్య‌క్తి కాపురం కూడ చేయ‌వ‌చ్చు. గ‌డువు ముగిసిన త‌రువాత తిరిగి త‌మ భార్య‌లు సొంత భ‌ర్త‌ల‌కు ద‌గ్గ‌ర‌వుతారు. ఇది అంతా ఏ ఆఫ్రికాలోనే, మ‌రెక్క‌డో అనుకుంటే మాత్రం పొర‌పాటు. సాక్షాత్తూ భార‌త‌దేశంలోని మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోనే ఈ సంప్ర‌దాయం ఉన్న‌ది.

Advertisement

Advertisement

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని శివ‌పురి జిల్లాలో భార్య‌ల‌ను అద్దెకు ఇచ్చే ధ‌డిచా సాంప్ర‌దాయం ఉన్న‌ది. దీని ప్ర‌కారం ధ‌న‌వంతులు డ‌బ్బులు ఇచ్చి నెల లేదా సంవ‌త్స‌రం కాలం పాటు వారి అవ‌స‌రాలు తీరేవ‌ర‌కు అద్దెకు తీసుకుంటారు. దీనిపై ఇరువురు కుటుంబాలు స్టాంప్ పేప‌ర్ల‌పై కూడ సంత‌కాలు చేస్తాయి. అద్దెకు వెళ్లిన మ‌హిళ‌, మాన‌సికంగా, శారీర‌కంగా అద్దెకు తీసుకున్న వారితో భార్య‌లాగా వ్య‌వ‌హ‌రించాలి. అయితే త‌క్కువ వ‌య‌స్సు ఉన్న వారికి డిమాండ్ ఎక్కువ‌ట‌. ధ‌డిచా సంప్ర‌దాయంపై పోలీసులు ప‌లుమార్లు అవ‌గాహ‌న క‌ల్పించినా అక్క‌డ తీరు మాత్రం మార‌డం లేదు.

Visitors Are Also Reading