స్టార్ హీరో విజయ్ ఆంటోని కూతురు మీరా ఈరోజు తెల్లవారుజామున 3:00 కి కన్ను మూసింది విజయ్ ఆంటోనీ కుమార్తెతో చివరిగా మాట్లాడింది ఎవరు, అసలు ఆమె ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంది అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం తమిళ ఇండస్ట్రీలోనే కాదు తెలుగు ఇండస్ట్రీలో కూడా కలకలం రేపుతోంది. విజయ్ ఆంటోనీ కూతురు చెన్నైలోనే వాళ్ళ ఇంట్లోనే సూసై* చేసుకుని చనిపోయింది. ఫ్యాన్ కి వేలాడుతూ కూతురు కనపడడంతో షాక్ కి గురైపోయాడు విజయ్. వెంటనే కావేరి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే ఆమెకు కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు.
Advertisement
Advertisement
అయితే ఆమె డిప్రెషన్ తో బాధపడుతోందని.. కొన్ని రోజులుగా మందులు కూడా తీసుకుంటుందని తెలుస్తోంది. మీరా చివరిసారి ఎవరితో మాట్లాడింది అని ఆమె ఫోన్ ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే విజయ్ అంటోని మీడియాతో మాట్లాడుతూ పిల్లలపై ఒత్తిడి చేయకూడదని.. ముఖ్యంగా ఇది చదువు అది చదువు అని వాళ్ళ కోరికలను పిల్లలపై రుద్దకూడదు అని చెప్పారు. ప్రస్తుతం ఆయన చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. విజయ్ అంటోనీకి సినీ ప్రముఖులు కాల్ చేసి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.
Also read:
- మహేష్ గుంటూరు కారం సినిమాలో.. మూడవ హీరోయిన్ గా.. ఆ స్టార్ హీరోయిన్…!
- ఆ హీరో మీద రివెంజ్ ని తీర్చుకోవడానికే.. ఐశ్వర్య ధనుష్ ని పెళ్లి చేసుకుందా….?
- విజయ్ ఆంటోని కూతురు ఎందుకు ఇలా చేసింది..? ఆ విషయాన్ని భరించలేకేనా..?