Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » విజయ్ ఆంటోని కూతురు ఎందుకు ఇలా చేసింది..? ఆ విషయాన్ని భరించలేకేనా..?

విజయ్ ఆంటోని కూతురు ఎందుకు ఇలా చేసింది..? ఆ విషయాన్ని భరించలేకేనా..?

by Sravya
Ads

హీరో విజయ్ ఆంటోనీ కూతురు లారా ప్రస్తుతం 12వ తరగతి చదువుతోంది. చిన్న వయస్సులో ఆమె ఎంతో కృంగిపోయి ఇటువంటి నిర్ణయం తీసుకుంది. ఆమె ఇలా చేయడంతో కుటుంబ సభ్యులందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే ఆమె ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనే విషయానికి వస్తే.. చదువులో ఉన్న ఒత్తిడి కారణంగానే ఆమె ఈ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో విజయ్ అంటోని ఒక మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. పిల్లలు ఎందుకు సూసై* చేసుకుంటారు అనే దాని వెనుక కారణం అయన చెప్పారు.

Advertisement

Ad

Advertisement

దేనికైనా మనం కమిట్మెంట్ ఇచ్చి దానికి తగ్గట్టుగా వర్క్ చేయకపోయినా లేదంటే వేరే వాళ్ళని ఎక్కువగా నమ్మి మోసం జరిగినప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయని విజయ్ చెప్పారు. చదువు విషయంలో విద్యార్థులు ఎక్కువగా ఒత్తిడికి గురై, ప్రాణం తీసుకుంటారని విజయ్ ఆంటోని చెప్పారు. మనకు ఉన్న ఆశయాలన్నీ పిల్లలపై రుద్ది అది, ఇది చదువు అంటూ టార్చర్ చేయకూడదని ఆయన అప్పుడు ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం ఆయన చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. కూతురు విషయంలో నీతి వాక్యాలు ఏమయ్యాయి అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. అయితే చదువు విషయంలో ఆమె ఒత్తిడిని తట్టుకోలేక ఇలాంటి నిర్ణయం తీసుకుని ఇప్పుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిందని అంతా భావిస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటంటే క్లారిటీగా తెలియదు.

Also read:

Visitors Are Also Reading