కొంతమంది కవలలు కనిపిస్తే వారిని గుర్తు పట్టలేం. కానీ కళ్ల ముందు ఇరవై ముప్పై మంది కనిపిస్తే వారిని గుర్తు పట్టడం ఇంకా కష్టం. రోజు చూసే వారిని సైతం అంత ఈజీగా గుర్తు పట్టలేం. అలాంటిది ఒకే ఫ్రేమ్ లో 30కి పైగా కవల జంటలు, ఒకే చోట చేరితే ఆ కన్‌ఫ్యూజన్ మామూలుగా ఉండదు. చూడడానికి రెండు కళ్లు సరిపోవు. అలాంటి అద్భుత దృశ్యం విశాఖ లో కనివిందు చేసింది. ప్రపంచ కవలల దినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ట్విన్స్ ఒకే దగ్గరకు చేరి సందడి చేశారు.
Also Read : రక్త రుగ్మతతో బాధపడుతున్న బాలుడికి కే.ఎల్.రాహుల్ రూ.31లక్షలు సాయం
Advertisement
వారందరూ దేవుడు చేసిన మనుషులు, మనుషులను పోలిన మనుష్యులు ఈ సృష్టిలో ఏడుగురు ఉంటారని మన పెద్దలు చెబుతుంటారు. ఇది కనిపెట్టడం చాలా అరుదు. అలాగే ఏదైనా ఊరిలోనో, ఇంటిలోనే కవలలు ఉంటే వారిని చూసి ఆశ్చర్యానికి గురవ్వడమే కాకుండా ఎంతో సంబురపడిపోతుంటాం. ఎందుకంటే ఒకే పోలికలతో అచ్చు గుద్దినట్టు జన్మించడం ఓ విధంగా దేవుడు ఇచ్చిన వరమనే చెప్పుకోవాలి. అలాంటి వారి కోసం ఫిబ్రవరి 22 ప్రపంచ కవలల దినోత్సవంగా ప్రకటించారు. ఈ తరుణంలో ఏపీతో పాటు తెలంగాణలో ఉన్న కవలలు ఒకే వేదికపై కలవాలనుకున్నారు.
Advertisement
శ్రీకాకుళం జిల్లాకు చెందిన రామ్‌లక్ష్మణ్ ట్విన్ బ్రదర్స్ ముందుకొచ్చారు. వారు ఓ వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసి రెండు రాష్ట్రాల్లో కవలలను గుర్తించి వారిని కలుపుకున్నారు. ఆటపాటలతో డ్యాన్స్‌లతో వెరైటీ గేమ్స్ కండక్ట్ చేసి ఎంజాయ్ చేశారు. తమ లాగే ఈ ప్రపంచంలో ఇంతమంది కవలలు ఉన్నారా అని తెగ సంబుర పడిపోయారు. విద్యార్థులు, చిన్నారులు గృహిణులు ఉద్యోగులు వీరందరూ ఈ కవలలులో ఉన్నారు. ఈ రోజును ఓ పండుగలా జరుపుకున్నామని తెలిపారు. కేక్ కట్ చేసి ఒకరినీ ఒకరు తినిపించుకుంటూ ఎంజాయ్ చేశారు. కవలలుగా తాము ఎదుర్కుంటున్న ఘటనలు సరదా సన్నివేశాల వంటివి షేర్ చేసుకున్నారు. ఈ కవలలను చూడడానికి రెండు కండ్లు సరిపోలేదంటున్నారు సందర్శకులు, మిత్రులు.
Also Read : వాళ్ళను చూసి కారు దిగిన ప్రధాని…ఏం చేశారో తెలుసా..!