Home » హ్యాపీడేస్ మూవీలో టైసన్ లవర్ కార్లింగ్ హెయిర్ బ్యూటీగుర్తుందా.. ఇప్పుడు ఇలా మారిందేంటి..?

హ్యాపీడేస్ మూవీలో టైసన్ లవర్ కార్లింగ్ హెయిర్ బ్యూటీగుర్తుందా.. ఇప్పుడు ఇలా మారిందేంటి..?

by Sravanthi Pandrala Pandrala
Ad

అప్పట్లో యూత్ కనెక్ట్ చేసిన మూవీ హ్యాపీ డేస్. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ 2007లో విడుదలై యువతను ఎంతో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో అందరూ కొత్తవాళ్లయినా కానీ వారి యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్నారు. మిల్కీ బ్యూటీ తమన్న, వరుణ్ సందేశ్ కు ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. అలాగే ఈ చిత్రంలో చాలామందిని ఆకట్టుకున్న మరో జోడి టైసన్ ( రాహుల్) ఆయన లవర్ శ్రావస్ ( సోనియా దీప్తి). ఇందులో ఆమె రింగు రింగుల జుట్టుకు మరింతమంది ఫ్యాన్స్ అట్రాక్ట్ అయ్యారు. దీనికి తోడు ఆమె వాయిస్ కూడా అందరినీ ఆకట్టుకుంది.

also read:సినిమాలు వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దగ్గుబాటి హీరో… అతను ఎవరో తెలుసా?

Advertisement

అయితే సోనియా పుట్టి పెరిగింది హైదరాబాదు. కంప్యూటర్ అప్లికేషన్స్ డిగ్రీ పూర్తిచేసిన ఈమె ఐటీ సంస్థలో మూడేళ్ల పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేసింది. అయితే ఒక ప్రమోషన్ ఈవెంట్ లో సోనీ అని చూసిన శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ లో స్రవంతి పాత్రకు సెలెక్ట్ చేశారు. ఆయన అనుకున్నట్లుగానే ఈ పాత్ర చాలా హిట్ అయింది. అంతే కాకుండా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ గా ఫిల్మ్ ఫైర్ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత ఈమెకు అనేక హీరోయిన్ అవకాశాలు వచ్చాయి.

Advertisement

also read:ఉపేంద్రతో లవ్ ఎఫైర్…. అలాంటివి కామన్ అంటూ నటి సంచలనం…!

అలా తెలుగు, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలో బిజీ యాక్టర్స్ గా మారిన సోనియా ఇండస్ట్రీ నుంచి సడన్ గా మాయమైంది. 2016 లో చిన్ని చిన్ని ఆశలు నాలో రేగేనే అనే తెలుగు సినిమాలో నటించింది. ఆ తర్వాత 2017లో తమిళ సినిమాలో చేసింది. ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై ఇక కనిపించలేదు. కానీ సామాజిక మాధ్యమాల్లో మాత్రం ఎప్పుడు బిజీగానే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆమె మళ్ళీ వెండితెరపై అడుగు పెట్టేందుకు సిద్ధమవుతుందట. అనుష్క నవీన్ పోలిశెట్టి హీరో హీరోయిన్ గా తెరకెక్కుతున్న “మిస్ శేట్టి మిస్టర్ పొలిశెట్టి” అనే సినిమాతో రి ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది.

also read:ఎన్నికల ముందు జగన్ మరో అస్త్రం..మే 9న “జగనన్నకు చెబుదాం”

Visitors Are Also Reading