Home » ఎన్టీఆర్ మీద ఆ అనవసర కామెంట్స్ తో టీడీపీకి మరింత డ్యామేజ్ అవ్వనుందా ?

ఎన్టీఆర్ మీద ఆ అనవసర కామెంట్స్ తో టీడీపీకి మరింత డ్యామేజ్ అవ్వనుందా ?

by Anji
Ad

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తరువాత ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ముఖ్యంగా టీడీపీ ని నడిపించే వారు ఎవ్వరు అనే ప్రశ్న తలెత్తింది. ఓ వైపు బాలకృష్ణ, మరోవైపు భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, అచ్చెన్నాయుడు ఇలా ఎవ్వరికీ వారు పార్టీ వ్యవహారాలను తాము చూసుకుంటామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు దర్శనివ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ పై  సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలయ్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Balayya comments on NTR

Advertisement

 

నందమూరి నటసింహం బాలకృష్ణ ఓ వైపు సినిమా చేస్తూ.. అటు రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ కావడంతో బాలకృష్ణ తన భుజాలపై టీడీపీ బాధ్యతలను వేసుకొని ముందుకు నడిపిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్టుపై ఇప్పటికే సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు స్పందించారు. కానీ ముఖ్యంగా నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  ఓవైపు టీడీపీ అభిమానులు.. మరోవైపు నందమూరి అభిమానులు అందరూ జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని కోరారు. మరికొంత మాత్రం ఎన్టీఆర్ స్పందించకపోవడమే ఉత్తమం అని సలహాలు కూడా ఇస్తున్నారు. 

Advertisement

ఇటీవలే సురేష్ బాబు కూడా ఓ ప్రెస్ మీట్ లో చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు. సినిమా రంగంలోకి రాజకీయాలు తీసుకురావద్దని సాప్ట్ గా చెప్పుకొచ్చారు. తాజాగా బాలయ్య హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు అరెస్ట్ గురించి సినీ రంగం నుంచి ఎవ్వరూ స్పందించకపోయినా పెద్దగా పట్టించుకోను అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించకపోయినా డోంట్ కేర్ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు బాలయ్య. ప్రస్తుతం బాలకృష్ణ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం విశేషం. పురంధేశ్వరితో కలిసి ముందుకు వెళ్తానని చెప్పుకొచ్చారు. చంద్రబాబుపై రాజకీయ కక్ష్యతోనే అబద్దపు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్రం హస్తం ఉందో లేదో తమకు తెలియదు అని.. కానీ తాము ఎవ్వరిపైనా అనవసరంగా నిందలు వేయమని వెల్లడించారు. ఈ విషయంపై తప్పకుండా కేంద్ర పెద్దలను కలుస్తానని బాలయ్య వివరించారు. మరోవైపు బాలయ్య ఎన్టీఆర్ పై చేసిన అనవసర కామెంట్స్ తో టీడీపీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు  

హీరోయిన్ సంఘవి కెరీర్.. ఆ దర్శకుడు వల్లే నాశనం అయిపోయిందా..?

 శరత్ కుమార్ దేవయానిని రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నారా..? మరి ఎందుకు రాధిక ని పెళ్లి చేసుకున్నారు..?

Visitors Are Also Reading