పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం BRO. ఈ సినిమా జులై 28న విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. తమిళ హిట్ సినిమా వినోదయ సీతమ్ మూవీకి రీమేక్ గా సముద్రఖని దర్శకత్వంలో రూపొందించిన ఈ మూవీ రీమేక్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ వల్ల మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్, టీజర్ సినిమాపై ఆసక్తి పెంచినప్పటికీ ఇటీవలే విడుదలైన ఫస్ట్ సింగిల్ ఆశించిన స్థాయిలో అలరించకపోవడం వల్ల ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు.
Advertisement
గతంలో పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన రీమేక్ సినిమాలు భీమ్లా నాయక్, వకిల్ సాబ్ లకు మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ ఏపీలో పవన్ కళ్యాణ్ కి రాజకీయంగా నెలకొన్న ప్రతికూలత వల్ల బ్రేక్ ఈవెన్ కూడా కాలేకపోయింది. ఇప్పుడు బ్రో సినిమాకి కూడా అదే సీన్ రిపీట్ అవుతుందా లేదా అనే ఆందోళన ఫ్యాన్స్ లో నెలకొంది. వాస్తవానికి పవన్ కళ్యా్ రెంగు సినిమాలకు బడ్జెట్ సింహభాగం రెమ్యునరేషన్ గా అందుకున్నాడు. సినిమా మేకింగ్ ఖర్చు రూ.20 నుంచి రూ.25 కోట్ల వరకు అనుకుంటే.. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ రూ.50కోట్లు.. ఇక ఇతర ఆర్టిస్ట్ ల రెమ్యునరేషన్, ప్రమోషన్ ఖర్చులు సుమారు రూ.25కోట్లు వెరసి సినిమా బడ్జెట్ రూ.100 కోట్ల వరకు అయింది. ఎంత పవన్ కళ్యాణ్ క్రేజ్ ని నమ్ముకొని నిర్మాతలు అంత బడ్జెట్ పెట్టినా బయ్యర్లు రీమేక్ సినిమాకి అంత రేట్ పెట్టడానికి ముందుకొచ్చే పరిస్థితి లేదు.
Advertisement
భీమ్లానాయక్, వకీల్ సాబ్ సినిమాలు బ్రేక్ ఈవెన్ కాలేకపోవడానికి ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్స్ ఇష్యూ, స్పెషల్ షోలకు అనుమతి లేకపోవడం వంటి ఓ కారణమైతే.. ఈ సినిమా స్థాయికి మించిన బడ్జెట్ మరో కారణం. బ్రో సినిమా బడ్జెట్ విషయంలో అదే జరిగిందని చెప్పాలి. టీజర్ లో రూ.100కోట్ల బడ్జెట్ కి తగిన విజువల్ క్వాలిటీ కనిపించకపోవడం.. థమన్ సంగీతం కూడా క్వాలిటీ విషయంలో గత సినిమాల కంటే తక్కువ స్థాయిలో ఉండటంతో బ్రో సినిమా బ్రేక్ ఈవెన్ చేరుకోవడం కష్టమే అనే సంకేతాలు ఇస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల దాడి కచ్చితంగా బ్రో మూవీపై ప్రభావం చూపే అవకాశమున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఏ మేరకు నిలదొక్కుకోగలదనేది వేచి చూడాలి మరీ.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
భార్యకు భర్త.. టైం ఇవ్వకపోతే..భార్య ఇలాంటి పనులే చేస్తుంది !
Baby Movie Review : బేబీ సినిమా రివ్యూ..రౌడీ హీరో తమ్ముడు హిట్టు కొట్టాడా ?