Home » రామ్ చరణ్ 16వ సినిమా “హాకీ” స్టోరీతో రానుందా..?

రామ్ చరణ్ 16వ సినిమా “హాకీ” స్టోరీతో రానుందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఆర్ ఆర్ ఆర్ మూవీ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సినీ జీవితంలో నే అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ హీరోగా జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ తన 15వ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నారని తెలుస్తోంది. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement

ఈ మూవీ కూడా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ తన 16వ సినిమాను గౌతమ్ తేన్నూరి దర్శకత్వంలో చేసేందుకు సిద్ధమయ్యారు. మళ్లీ రావా, జెర్సీ లాంటి ఎమోషనల్ సినిమాలతో మంచి విజయాలను అందుకున్న గౌతమ్, హీరో రామ్ చరణ్ తో కూడా అలాంటి సినిమానే చేస్తారని ఫ్యాన్స్ భావించారు. కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ మూవీ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

భారీ యాక్షన్ సన్నివేశాలను గౌతమ్ తెరకెక్కించనున్నట్లు ఇందులో రామ్ చరణ్ ను మాస్ లుక్ లో చూపించనున్నారని తెలుస్తోంది. ఈ మూవీని కూడా భారీ బడ్జెట్ తో నిర్మించినున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మూవీ మొత్తం ఒక స్పోర్ట్స్ డ్రామా కథ ఆధారంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో చరణ్ హాకీ ప్లేయర్ గా కనిపించనున్నారని సమాచారం. స్పోర్ట్స్ ఆడే చరణ్ తన కలను నాశనం చేయాలని చూస్తారు విలన్లు. వారిని ఎలా ఎదుర్కొంటాడు అనేది ఈ కథలో ఉంటుందని తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ALSO READ;

క‌థ న‌చ్చినా “జోష్” సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యింది..5 కార‌ణాలు ఇవేనా..!

హీరోగా నటించాల్సిన డీఎస్పీ ఎందుకు డ్రాప్ అయ్యాడు…ఎవరు వద్దన్నారో తెలుసా…!

 

Visitors Are Also Reading