Home » ఛత్రపతి హిందీ రీమేక్ లో ఇలా చేసారు ఏంటి ?? రాజమౌళి ఫీల్ అవుతారు..!

ఛత్రపతి హిందీ రీమేక్ లో ఇలా చేసారు ఏంటి ?? రాజమౌళి ఫీల్ అవుతారు..!

by Anji
Ad

రెబ‌ల్ స్టార్ హీరోగా ప్ర‌భాస్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన ఛ‌త్ర‌ప‌తి సినిమా 2005 సెప్టెంబ‌ర్ 30న థియేట‌ర్ల‌లో విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బాస్ట‌ర్ హిట్ కొట్టింది. ఈ సినిమా రికార్డు స్థాయి లో క‌లెక్ష‌న్‌ల‌ను సొంతం చేసుకోవ‌డంతో పాటు మాస్ ప్రేక్ష‌కుల‌లో ప్ర‌భాస్‌కు ఊహించ‌ని స్థాయిలో క్రేజ్‌ను పెంచిన‌ది. ఈ చిత్రంలో యాక్ష‌న్ సీన్లు, తల్లీకొడుకు సెంటిమెంట్ సీన్లు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఈ చిత్రం విడుద‌లై 16 సంవ‌త్సరాలు గ‌డిచిన సంద‌ర్భంగా టీవీలో ఈ సినిమాకు మంచి రేటింగ్సే వ‌స్తున్నాయి.

Also Read: నాకు కొడాలి నాని తెలియ‌దు..ఆర్జీవీ మ‌రో కౌంటర్..!

Advertisement

SS Rajamouli launches Bellamkonda Sreenivas's Chatrapathi Hindi remake - Movies News

ఇక బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరోగా వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో హీందీలో రిమేక్ అవుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ పూర్త‌యిన‌ది. హిందీ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే విధంగా ఈ సినిమా స్క్రిప్ట్ లో ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్‌, వీ.వీ.వినాయ‌క్ కీల మార్పులు చేసార‌ని స‌మాచారం. ఈ సినిమాలోని సెంటిమెంట్ సీన్ల‌ను త‌గ్గించి యాక్ష‌న్ సీన్ల‌కు వినాయ‌క్ ఎక్కువ‌గా ఇచ్చారు అని బాలీవుడ్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి టాక్‌ వినిపిస్తుంది.

Advertisement

Also Read: సుధీర్ అన్న ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పు..? ప్లీజ్‌..!

Hindi remake of Prabhas' Chatrapathi launched, SS Rajamouli claps first shot; see pics - Hindustan Times

విల‌న్‌, హీరోల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల విష‌యంలో హిందీలో కీల‌క మార్పులు చేశారు అని తెలుస్తోంది. ఈ సినిమా కోసం బెల్లంకొండ శ్రీ‌నివాస్ త‌న లుక్‌ను పూర్తిగా మార్చుకున్నార‌ట‌. త్వ‌ర‌లో ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కానున్న‌ది. ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీ‌నివాస్ హిందీలో స‌క్సెస్ అందుకుంటారు ఏమో చూడాలి మ‌రీ. రాజ‌మౌళి టేకింగ్ వ‌ల్ల తెలుగులో హిట్ అయిన ఈ సినిమా హిందీలో ఎలాంటి ఫ‌లితాన్ని సాధిస్తుంద‌నే అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Bellamkonda Sreenivas's Chatrapathi Hindi remake sets in Hyd damaged due to heavy rains - Movies News

ఇక ఈ సినిమా స‌క్సెస్ అయితే బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో వినాయ‌క్‌కు సినిమా ఆప‌ర్లు పెరిగే అవ‌కాశముంటుంది. ఇప్ప‌టికే ప‌లువురు టాలీవుడ్ ద‌ర్శ‌కులు బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో స‌త్తా చాట‌గా రాజ‌మౌళికి బాలీవుడ్ ఆఫ‌ర్లు వ‌స్తున్నా.. ఆ ఆఫ‌ర్ల‌ను జ‌క్క‌న్న సున్నితంగా రిజెక్ట్ చేస్తున్నాడ‌ట‌. భ‌విష్య‌త్‌లో రాజ‌మౌళి బాలీవుడ్‌పై దృష్టి పెడ‌తారో లేదో చూడాలి మ‌రీ. మ‌రోవైపు హిందీ ఛ‌త్ర‌ప‌తిలో చేసిన మార్పుల వ‌ల్ల రాజ‌మౌళి ఫీల్ అవుతారేమోన‌ని కొంత‌మంది కామెంట్ చేస్తున్నారు.

Visitors Are Also Reading