Home » సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీపై నిఖిల్ మూవీలో క్లారిటీ ఇవ్వనున్నారా ?

సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీపై నిఖిల్ మూవీలో క్లారిటీ ఇవ్వనున్నారా ?

by Anji
Ad

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవలే కార్తీకేయ 2, 18 పేజీస్ మూవీస్ ప్రేక్షకుల ముందుకొచ్చారు. కార్తీకేయ 2 దేశవాప్తంగా సంచలన విజయం నమోదు చేసింది. తాజాగా నిఖిల్ ఓ స్పై చిత్రంలో నటిస్తున్నారు. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీ.హెచ్. దర్శకుడిగా పరిచయమవుతూ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ సినిమాపై  భారీ అంచనాలు క్రియేట్ చేసాయి. 

Also Read :   శభాష్ మెగాస్టార్….తాను చదువుకున్న కాలేజీ కోసం చిరంజీవి భారీ త్యాగం

Advertisement

ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. ఈ సందర్భంగా యూనిట్ ఈ మూవీపై ఆసక్తి పెంచేవిధంగా అప్డేట్స్ వదులుతున్నారు. నెట్టింట వైరల్ గా మారుతున్న లోగోపై హైప్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఈ మూవీలో స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ ముఖంతో ఉన్న లోగోను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో ఆయనకు సంబందించిన పలు ఆసక్తికరమైన విషయాలను సినిమాలో తెలపబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా అత్యంత రహస్యంగా ఉంచిన మరిన్ని విషయాలు సినిమాలో రివీల్ చేయబోతున్నట్టు సమాచారం. 

Advertisement

Also Read :  “రామబాణం” ను మిస్ చేసిన మెగా హీరో ఎవరో తెలుసా?

Manam News

ఫస్ట్ లుక్ టీజర్ మే 12న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ కనిపించబోతుంది. ఆర్యన్ రాజేష్ ప్రముఖ పాత్రలో కనిపించగా.. ఈ మూవీని జూన్ 29న విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా నిర్మాతలు కాస్త భయానికి గురవుతున్నారు. ఇటీవల అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ఏజెంట్ మూవీ స్పైయాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కడంతో ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో అఖిల్ రెమ్యునరేషన్ కూడా రిటర్న్ ఇచ్చాడట. నిఖిల్  సినిమాలో చాలా జాగ్రత్త పడుతున్నాడట. ఒకటికి రెండు సార్లుచెక్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.  ఈ సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి.

Also Read :   ఆ దర్శకుడితో లవ్ లో పడిపోయిన సింగర్ సునీత… మరి రామ్ పరిస్థితి?

Visitors Are Also Reading