Home » ముగ్గురు సీనియర్ హీరోలను తట్టుకొని హనుమాన్ సక్సెస్ సాధిస్తుందా ?

ముగ్గురు సీనియర్ హీరోలను తట్టుకొని హనుమాన్ సక్సెస్ సాధిస్తుందా ?

by Anji
Published: Last Updated on
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకోవడానికి ఆహార్నిశలు కష్టపడుతూ సినిమాను చేస్తుంటారు. అయితే ఈ సంక్రాంతికి ముగ్గురు స్టార్ హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి మన ముందుకు వస్తున్నారు. అందులో ముఖ్యంగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో వస్తే, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక ఇదే క్రమంలో హనుమాన్ సినిమా కూడా ప్రేక్షకులను అలరించడానికి మన ముందుకు వస్తుంది.


అయితే వీళ్ళు ముగ్గురు సీనియర్ హీరోలు మధ్యలో ఒక యంగ్ హీరో సినిమా రావడం అనేది ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిజానికి హనుమాన్ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉండటంతో ఈ సినిమా మీద ఆటోమేటిక్ గా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెరిగిపోయాయి. దాంతో ఈ సినిమా కూడా భారీ వసూళ్లను రాబడుతుందని టాక్ అయితే వినిపిస్తుంది. మరి సీనియర్ హీరోలను తట్టుకొని ఈ సినిమా ఎంతవరకు నిలబడుతుంది అని మరి కొంతమంది వాళ్ళ కామెంట్లని తెలియజేస్తున్నారు.

Advertisement


నిజానికి మిగతా ముగ్గురు హీరోలు కూడా ఇండస్ట్రీలో దాదాపు 20 సంవత్సరాల పైన కెరియర్ ని కొనసాగిస్తున్న వాళ్ళు కావడం అందులోనూ తేజ సజ్జా ఒక యంగ్ హీరో ఆయనకి సరిగ్గా ఒకటి రెండు హిట్లు కూడా లేవు, అలాంటి ఒక యంగ్ హీరో వాళ్ళని తట్టుకొని ఏ మేరకు నిలబడగలుగుతాడు అనేది కూడా ఇప్పుడు ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే మరి కొంతమంది మాత్రం కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేకుండా అన్ని సినిమాలు ఆడతాయి అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరి సంక్రాంతి బరిలో హిట్ కొట్టి ఈ సంక్రాంతి విన్నర్ ఎవరు అవుతారో తెలియాలంటే సంక్రాంతి పండుగ వరకు ఎదురు చూడక తప్పదు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి..!

Visitors Are Also Reading