ఉరుకుల పరుగుల జీవితంలో భార్య భర్తలు అసలు మడ్లాడుకోవాడనికి కూడా సమయం ఉండటం లేదు. దాదాపు గా ప్రస్తుతం భార్య భర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. దాంతో భర్తలు కలిసి మాట్లాడుకునే సమయం కూడా దొరకడం లేదు.
Advertisement
అయితే ఇద్దరూ బిజీగా ఉండటం…మాట్లాడుకోవడానికి సమయం కూడా ఉండక పోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే భార్య భర్త ల మధ్య సత్సంబధాలు ఉంటాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఆఫీసుకు వెళ్లి వచ్చిన తరవాత ఇద్దరూ అలసిపోతారు.
READ ALSO : విరాట్ కోహ్లీ బయోపిక్ లో రామ్ చరణ్!
దాంతో అసలు కలిసి మాట్లాడుకోవడానికి సమయం దొరకదు. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత వంట చేసుకోవడం తినడం తోనే సమయం గడిచిపోతుంది. అయితే ఉదయం మాత్రం ఇద్దరూ కలిసి సమయాన్ని గడపాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం ఆఫీస్ కు వెళ్ళే ముందు ఇద్దరూ కూడా ఫ్రీ గా ఉంటారు. ఉదయం కలిసి కాఫీ తాగుతూ మాట్లాడుకోవాలి సూచిస్తున్నారు. అంతే కాకుండా ఉదయం భార్య చేసే పనుల్లో భర్త సాయం అందించాలని సూచిస్తున్నారు.
Advertisement
READ ALSO : తండ్రి మరణంతో ఒంటరైన అమ్మ… తల్లికి మళ్లీ పెళ్లి చేసిన కొడుకులు
అలా భార్య కు సాయం చేసే సమయం లో మనసువిప్పి మాట్లాడుకోవడం జరుగుతుంది. అంతే కాకుండా ఇద్దరూ కలిసి వ్యాయామం చేయడం వల్ల ఆ సమయంలో కూడా మాట్లాడుకోవచ్చు. అలా చేయడం వల్ల ఇద్దరి మధ్య అనుబంధం బలంగా మారుతుంది. ఇక ఇద్దరూ అలా దగ్గర అవ్వడంతో వారి శృం*రం జీవితం కూడా చక్కగా ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ఉదయం శృం*రం లో పాల్గొనటం వల్ల ఆ రోజు అంతా ఉత్తేజితం గా ఉంటారని చెబుతున్నారు.
READ ALSO : 2023 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ఫిక్స్… హైదరాబాదులో ఆ మ్యాచులు!