Home » జీవిత భాగస్వామి తో చర్చించకూడని 10విషయాలు….మూడవది చాలా ముఖ్యమైనది….!

జీవిత భాగస్వామి తో చర్చించకూడని 10విషయాలు….మూడవది చాలా ముఖ్యమైనది….!

by AJAY

పెళ్లికి ముందు ఎలా ఉన్నా చెల్లుతుంది. కానీ పెళ్లి తర్వాత మాత్రం అమ్మాయిలు అబ్బాయిలు అయినా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా దాంపత్య జీవితం నిలబడాలి అంటే ఇద్దరు కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా భార్యాభర్తలు ఒకరితో మరొకరు కొన్ని విషయాలను షేర్ చేసుకోవద్దు. ఆ విషయాలను షేర్ చేసుకుంటే కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉంది.

అవేంటో ఇప్పుడు చూద్దాం…. పెళ్లికి ముందు ఉన్న ప్రేమలు, అఫైర్స్ గురించి ఒకరితో మరొకరు చర్చించుకోకూడదు. దానివల్ల గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే మరొకరు దాన్ని పదేపదే ఎత్తిచూపకూడదు. అలా ఎత్తి చూపడం వల్ల కలహాలు పెరిగి కాపురాలు కూలిపోయే ప్రమాదం ఉంది.

అంతేకాకుండా భార్య కుటుంబ సభ్యుల గురించి భర్త…. భర్త కుటుంబ సభ్యుల గురించి భార్య చెడుగా మాట్లాడకూడదు. అలా కూడా గొడవలు జరిగే అవకాశం ఉంది. భార్య స్నేహితుల గురించి భర్త…. భర్త స్నేహితుల గురించి భార్య గుచ్చి గుచ్చి అడగకూడదు. అలా చేసినా లేనిపోని అనుమానాలు వచ్చి కాపురంలో కలహాలు వచ్చే అవకాశం ఉంది.

భార్య కానీ భర్త కానీ అందం విషయంలో సంపాదన విషయంలో లేదా ఇతర విషయాల్లో మరొకరితో పోల్చకూడదు. అలా పోల్చడం వల్ల గొడవలు జరిగే ప్రమాదం ఉంది. ఇద్దరిలో ఎవరికైనా ఆర్థిక సమస్యలు వస్తే వాటిని ఒకరిపై మరొకరు వేయకుండా ఎవరివి వాళ్లే పరిష్కరించుకుంటే మంచిది. పెళ్లికి ముందు ఉండే చెడు అలవాట్లను పూర్తిగా వదిలేయాలి. భార్య కానీ భర్త కానీ పెళ్లి తర్వాత కూడా ఆ చెడు వల్ల వాట్లను కొనసాగిస్తే కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉంది.

Visitors Are Also Reading