Home » Yamadonga: యమదొంగ లో రాజమౌళి వద్దన్న కూడా.. విజయేంద్రప్రసాద్ ఆ సీన్ ఎందుకు పెట్టారు..?

Yamadonga: యమదొంగ లో రాజమౌళి వద్దన్న కూడా.. విజయేంద్రప్రసాద్ ఆ సీన్ ఎందుకు పెట్టారు..?

by Sravya
Ad

Yamadonga: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యమదొంగ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా దర్శకుడు పాత్ర చాలా ముఖ్యమైనది. ఆ దర్శకుడు పెట్టిన ఎఫర్ట్ కారణంగా సినిమా సక్సెస్ అవుతుంది రాజమౌళి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. దర్శక ధీరుడు రాజమౌళి ఫెయిల్యూర్ లేని డైరెక్టర్ గా కొనసాగుతూ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా వెలుగొందారు. అద్భుతమైన సినిమాలను తెరమీదకి తీసుకువస్తూ తెలుగు చిత్ర పరిశ్రమని ఓ రేంజ్ లో నిలబెట్టారు రాజమౌళి.

Advertisement

ఇక రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన యమదొంగ సినిమా విషయానికి వస్తే ఒక సీను సినిమాలో పెట్టద్దు అని రాజమౌళి వద్దన్నా కూడా విజయేంద్ర ప్రసాద్ ఆ సినిమాలో ఆ సీన్ ని పెట్టారట. కచ్చితంగా సినిమాలో ఆ సీన్ ఉండాలని విజయేంద్ర ప్రసాద్ రాజమౌళికి చెప్పి ఆ సీన్ ని పెట్టారట. అది ఏ సీన్ అంటే ఎన్టీఆర్ చనిపోయి యమ లోకానికి వెళ్లిన తర్వాత అక్కడ కొన్ని డబల్ మీనింగ్ తో సాగే డైలాగ్స్ తో సీన్ ఉంటుంది. ఆ సీన్ ని సినిమాలో పెట్టొద్దని రాజమౌళి ఎంత వాదించినా విజయేంద్ర ప్రసాద్ వినకుండా మాస్ ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేయాలంటే ఇలాంటి డైలాగులు ఉండాలని వాళ్ల ద్వారానే సినిమా ఎక్కువగా కలెక్షన్స్ వస్తాయని అన్నారట.

Advertisement

Also read:

అంత పెద్ద వల్గర్ డైలాగులు ఏమీ లేకపోయినా కూడా అప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం అవి కొంచెం శృతి మించిన డైలాగులు అని చెప్పొచ్చు. ఇప్పుడంటే సినిమాల్లో రకరకాల సీన్లు పెడుతున్నారు వివిధ రకాలుగా డైలాగులు ఉంటున్నాయి ఈ సీన్ల మధ్య ఆ సీన్లు ఏమాత్రం ఎవరికీ ఏమీ అనిపించదు. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ అలాంటి సీన్స్ చూడాలంటే కాస్త ఇబ్బంది పడేవాళ్ళు. అలాంటి డైలాగులు సినిమాల్లో పెట్టడం రాజమౌళికి ఇష్టం లేకపోవడంతో ఆ సీన్లు పెట్టొద్దని చెప్పారు కానీ విజయేంద్రప్రసాద్ పట్టుబట్టి మరి ఆ సీన్లని పెట్టారు ఈ మూవీ సూపర్ సక్సెస్ అయ్యేలా చేశారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading