Home » మొదట రాఖీ కట్టిన వ్యక్తిని శ్రీదేవి ఎందుకు పెళ్లి చేసుకుంది ? ఆమెను ఆ స్టార్ హీరో మోసం చేసారా ?

మొదట రాఖీ కట్టిన వ్యక్తిని శ్రీదేవి ఎందుకు పెళ్లి చేసుకుంది ? ఆమెను ఆ స్టార్ హీరో మోసం చేసారా ?

by AJAY
Ad

ఒకప్పుడు సార్ హీరోల రేంజ్ లో అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది అతిలోక సుందరి శ్రీదేవి అనే చెప్పాలి. స్టార్ హీరోలకు సమానంగా అభిమానులనే కాకుండా హీరోల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ కూడా శ్రీదేవినే. ఆ అతిలోక సుంద‌రితో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు సైతం వేచి చూడాల్సిన పరిస్థితితులు ఉండేవి. శ్రీదేవి డేట్స్ దొరకడం అంటే అంతా సులువైన పని కూడా కాదు. గ్యాప్ లేకుండా శ్రీదేవి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఉండేవారు.

 

Advertisement

మెగాస్టార్ లాంటి చిరంజీవి సినిమాకే కండిషన్స్ పెట్టిన ఘనత కూడా శ్రీదేవికే దక్కుతుంది. శ్రీదేవి ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు లాంటి స్టార్ల పక్కన జతకట్టడమే కాకుండా ఆ తర్వాత తరంలో చిరంజీవి లాంటి స్టార్ హీరోల పక్కన కూడా నటించి అలరించారు. సౌత్ లో ఎంతో పాపులర్ అయిన తర్వాత శ్రీదేవి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అక్కడ కూడా వ‌రుస హిట్లు పడటంతో శ్రీదేవి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారారు. ఇక బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభంలో శ్రీదేవి హీరో మిథున్ చక్రవర్తి తోనే ఎక్కువ సినిమాలు చేసింది.

Advertisement

ఆ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. కానీ అప్పటికే మిథున్ చక్రవర్తికి పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. శ్రీదేవి మిథున్ చక్రవర్తి విషయం తెలిసి ఆయన భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. దాంతో మిథున్ శ్రీదేవిని దూరం పెట్టేశాడు. ఆ తర్వాత బోనీకపూర్ శ్రీదేవి హీరోయిన్ గా అనేక చిత్రాలు నిర్మించాడు. ఆ సమయంలో శ్రీదేవిని బోనీ కపూర్ ఓదార్చేవాడు. అలా శ్రీదేవి బోనికపూర్ మధ్య స్నేహం చిగురించింది.

కానీ అలాంటి సమయంలోనే అనుమానం వచ్చిన మిథున్ చక్రవర్తి…. శ్రీదేవి లైఫ్ లోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. అంతేకాకుండా బోనీ కపూర్ కు రాఖీ కట్టాలని శ్రీదేవికి ఆర్డర్ వేసాడు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి బంధం లేదని చెప్పినా విన‌కుండా మిథున్ చక్రవర్తి శ్రీదేవితో బోణీకపూర్ కు రాఖీ కట్టించాడు. ఆ తర్వాత మిథున్ చక్రవర్తి చేసిన మోసాన్ని గుర్తించిన శ్రీదేవి అతడికి పూర్తిగా దూరం అయింది. బోనీ కపూర్ కు దగ్గర అయింది. కొంతకాలం ప్రేమలో మునిగితేలిన శ్రీదేవి బోణీకపూర్ ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లికి ముందే శ్రీదేవి గర్భం దాల్చగా ఆ తరావత వీరు వివాహం చేసుకున్నారు.

Visitors Are Also Reading