Home » ఆలీతో సినిమా చేస్తే నీ సినిమా జీవితం నాశనం అవుతుందని భయపెట్టింది ఎవరు ? ఎందుకు చేసారు..?

ఆలీతో సినిమా చేస్తే నీ సినిమా జీవితం నాశనం అవుతుందని భయపెట్టింది ఎవరు ? ఎందుకు చేసారు..?

by AJAY
Ad

టాలీవుడ్ లో మ‌హాన‌టి సావిత్రి త‌ర‌వాత మ‌ళ్లీ అంత‌టి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సౌంద‌ర్య‌. త‌న అందం అభిన‌యంతో సౌంద‌ర్య ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. గ్లామ‌ర్ షో కు దూరంగా ఉంటూ కేవ‌లం న‌ట‌న‌తోనే ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. దాంతో పెద్ద‌లు చిన్నలు యూత్ అని తేడా లేకుండా సౌంద‌ర్య‌ను ప్ర‌తిఒక్క‌రూ అభిమానించేవారు. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలోనే సౌంద‌ర్య బీజేపీలో చేరారు.

Advertisement

ఆ స‌మ‌యంలో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం హెలికాప్ట‌ర్ లో బ‌య‌లుదేర‌గా ఆమెను మృత్యువు వెంటాడింది. దాంతో సౌంద‌ర్య చిన్న‌వ‌య‌సులోనే క‌న్నుమూశారు. ఇక ఇప్ప‌టికీ సౌంద‌ర్య‌ను తెలుగు ప్రేక్ష‌కులు మ‌ర్చిపోలేక‌పోతున్నారు. ఇదిలా ఉంటే సౌంద‌ర్య టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అంద‌రి స‌ర‌స‌న సినిమాలు చేశారు. అంతే కాకుండా క‌మెడియ‌న్ ఆలీకి జోడిగా కూడా న‌టించారు.

Advertisement

ali yamaleela

ali yamaleela

 

అయితే ఎస్వీ కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఆలీ హీరోగా వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా య‌మ‌లీల లో కూడా సౌంద‌ర్య హీరోయిన్ గా న‌టించాల్సి ఉంది. ముందుగా సౌంద‌ర్య‌నే హీరోయిన్ గా తీసుకోవాల‌ని అనుకున్నారు. కానీ అప్పటికే సౌంద‌ర్య హీరోయిన్ గా చేస్తున్న కొన్ని సినిమాల నిర్మాత‌లు వ‌చ్చి య‌మ‌లీల సినిమా నుండి త‌ప్పుకోవాల‌ని చెప్పారు.

ali yamaleela

క‌మెడియ‌న్ ప‌క్క‌న సౌంద‌ర్య హీరోయిన్ గా న‌టిస్తే త‌మ సినిమా ఇమేజ్ పోతుంద‌ని చెప్పారు. ఆ విష‌యాన్ని సౌంద‌ర్య తండ్రి స‌త్య‌నార‌య‌ణ ఎస్వీకృష్ణ‌రెడ్డికి చెప్పి ఆ ప్రాజెక్టును క్యాన్స‌ల్ చేసుకున్నారు. ఆ త‌ర‌వాత హీరోయిన్ గా ఇంద్ర‌జ‌ను ఎంపిక చేశారు. ఇక య‌మ‌లీల సినిమా అప్ప‌ట్లో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఆ త‌ర‌వాత సౌంద‌ర్య ఆలీ ప‌క్క‌న క‌లిసి న‌టించింది.

ALSO READ :టాలీవుడ్ స్టార్స్ కుమార్తెలను ఎప్పుడైనా చూశారా..? వాళ్లు ప్ర‌స్తుతం ఏం చేస్తున్నారంటే..!

Visitors Are Also Reading