Home » శ్రేయాస్ ను మళ్ళీ అవమానించిన బీసీసీఐ..!

శ్రేయాస్ ను మళ్ళీ అవమానించిన బీసీసీఐ..!

by Azhar
Ad

కోహ్లీ తర్వాత భారత జట్టుకు కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్‌ మొదట్లో పేరు అనేది సంపాదించుకున్నాడు. ఐపీఎల్ లో అతను ఢిల్లీ జట్టును నడిపిన తీరు అందరికి నచ్చింది. కానీ ఐపీఎల్ 2020కి ముందు అతను గాయపడటం అనేది తన కెరియర్ ను మార్చేసింది. ఐపీఎల్ లో ఢిల్లీ జట్టు కెప్టెన్సీ పోయి.. కేకేఆర్ జట్టులోకి వచ్చాడు. ఇక ఇండియా జట్టులో అతని స్థానంలో వచ్చిన సూర్య బాగా రాణిస్తుండటం కూడా అతనికి మైనస్ అయ్యింది.

Advertisement

అయితే ఎపుడైనా ఎవరైనా గాయపడితే జట్టులోకి వచ్చే శ్రేయాస్ అయ్యర్‌.. ఈ నెలలో ప్రారంభం కాబోతున్న టీ20 ప్రపంచ కప్ లో స్టాండ్ బై ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఇక ఈ టోర్నీకి ముందు సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో కూడా బాగా రాణించాడు. కానీ ఉన్నట్టుండి.. బీసీసీఐ అవమానకర రీతిలో శ్రేయాస్ అయ్యర్‌ ను ప్రపంచ కప్ స్టాండ్ బై ఆటగాళ్ల లిస్ట్ నుండి తప్పించింది.

Advertisement

తాజాగా ప్రపంచ కప్ జట్టులో ఆడే మిగిలిన ఆటగాళ్లు ఆసీస్ వెళ్లగా.. శ్రేయాస్ అయ్యర్‌ మాత్రం ఇక్కడే ఉండిపోయాడు. అతనికి బీసీసీఐ సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో పాల్గొనాలని సూచించినట్లు తెలుస్తుంది. అయితే శ్రేయాస్ అయ్యర్‌ షార్ట్ బాల్‌ ఆడలేడు అనే విషయం అందరికి తెలిసిందే. ఇక ఆసీస్ లోని పిచ్లు మొత్తం బౌన్సీ కావడంలో అయ్యర్ అక్కడ రాణించలేడు అని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

పదవి పోవడంపై గంగూలీ రియాక్షన్ ఇలా..?

ఇండియా ఫ్యాన్స్ మంచోళ్ళు అంటూ సొంత ఫ్యాన్స్ కు పాక్ విమర్శలు..!

Visitors Are Also Reading