Home » చంద్రముఖి 2 సినిమాని సాయి పల్లవి ఎందుకు రిజెక్ట్ చేసింది? దీని వెనుక అసలు కారణం ఏంటంటే?

చంద్రముఖి 2 సినిమాని సాయి పల్లవి ఎందుకు రిజెక్ట్ చేసింది? దీని వెనుక అసలు కారణం ఏంటంటే?

by Srilakshmi Bharathi
Ad

కొరియోగ్రాఫర్ నుండి నటుడు-దర్శకుడు గా ఎదిగిన లారెన్స్ తాజాగా హర్రర్ డ్రామా చంద్రముఖి 2 లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 15న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో లారెన్స్ పలు మీడియా సంస్థలతో ఇంటరాక్ట్ అవుతూ ఈ సినిమాకు ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కంగనా రనౌత్ ను తీసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఫస్ట్ పార్టీ ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పాల్సిన పని లేదు. ఏళ్ళు గడుస్తున్నా ఈ సినిమా స్టోరీ క్రేజ్ తగ్గలేదు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సీక్వెల్ గా చంద్రముఖి 2 తీస్తున్నారు. ఈ సీక్వెల్ లో చంద్రముఖి పాత్రను కంగనా పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ లో కంగనా ఆకట్టుకున్నారు. నిజానికి చంద్రముఖి పాత్ర కోసం డైరెక్టర్ పి వాసు మొదటగా సాయి పల్లవి ని సంప్రదించారు. కానీ ఆమె ఈ అవకాశాన్ని తిరస్కరించారట.

Advertisement

ఈ పాత్రకి నిజంగా స్కోప్ ఎక్కువ ఉంటుంది. దానికి తోడు నర్తకి పాత్ర కాబట్టి సాయి పల్లవి అయితేనే బాగుంటుందని వాసు అనుకున్నారట. కానీ ఈ పాత్రని సాయి పల్లవి ఒప్పుకోకపోవడంతో సెకండ్ హైయెస్ట్ ఛాయస్ గా అనుకున్న కంగనాను ఈ పాత్ర కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. సాయి పల్లవి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పక్కర్లేదు. తాను ఏ పాత్రను ఎంచుకున్న అందుకు తగ్గ న్యాయం చేయగలను అనుకుంటే, లేదా ఆ పాత్ర తనకు నప్పుతుంది అనుకుంటేనే అందుకు అంగీకరిస్తారు. లేకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా నో చెప్పేస్తారు. ఈ లెక్కన ఆమె ఒప్పుకున్న సినిమాల కంటే.. నో చెప్పిన సినిమాలే ఎక్కువ ఉన్నాయి. ఈ సినిమాలో చంద్రముఖి పాత్రకు కంగనా కూడా బాగ్ సూట్ అయ్యారు. కానీ, సాయి పల్లవి ఈ రోల్ కు ఒప్పుకుని ఉంటె మాత్రం ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేదని సాయి పల్లవి అభిమానులు భావిస్తున్నారు.

మరిన్ని..

బిగ్ బాస్ కి వచ్చిన రతిక రోజ్ ఎవరు…? ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటంటే..?

గొప్ప మనసు చాటుకున్న లారెన్స్.. చూస్తే మీరూ శభాష్ అంటారు..!

డీజే టిల్లుకు జోడీగా వైష్ణవి చైతన్య.. ఏ సినిమాలో అంటే..?

Visitors Are Also Reading