Telugu News » Blog » Ramesh Babu Ghattamaneni : తండ్రి, తమ్ముడు సూపర్ స్టార్స్…కానీ రమేష్ బాబు ఫెయిల్యూర్ కు కారణాలు ఇవే…!

Ramesh Babu Ghattamaneni : తండ్రి, తమ్ముడు సూపర్ స్టార్స్…కానీ రమేష్ బాబు ఫెయిల్యూర్ కు కారణాలు ఇవే…!

by AJAY

సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు మహేష్ బాబు అన్న రమేష్ బాబు ఆనారోగ్యంతో మృతిచెందిన సంగతి తెలిసిందే. రమేష్ బాబు దాదాపు 15 చిత్రాలకు పైగా నటించారు.

అంతే కాకుండా కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. మహేష్ బాబు హీరోగా నటించిన అర్జున్ సినిమాను రమేష్ బాబు నిర్మించారు. అయితే కొంతకాలానికి రమేష్ బాబు పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. దానికి కారణాలు ఎంటో ఇప్పుడు చూద్దాం… రమేష్ బాబు బాల నటుడిగా 1974లో అల్లూరి సీతారామరాజు సినిమా తో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

Ramesh babu

Advertisement

Ramesh Babu Ghattamaneni

ఆ తర్వాత వరుసగా దొంగలకు దొంగ, మనుషులు చేసిన దొంగలు, అన్నదమ్ముల సవాల్ లాంటి సినిమాలలో బాల నటుడిగా అలరించారు. ఇక 1987 లో సోలో హీరోగా రమేష్ బాబు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 12కు పైగా సినిమాలలో ఆయన హీరోగా నటించారు. కానీ బజార్ రౌడీ సినిమా మినహా మిగతా సినిమాలు ఆశించిన విజయం సాధించలేకపోయాయి. అంతేకాకుండా రమేష్ బాబు మొదట్లో మాస్ సినిమాల్లో నటించారు. Ramesh Babu Ghattamaneni మాస్ సినిమాలు అనుకున్న రీతిలో విజయం సాధించకపోవడంతో ఫ్యామిలీ సినిమాల పై దృష్టి పెట్టారు. నా ఇల్లే నా స్వర్గం, అన్నాచెల్లెళ్ళు, పచ్చతోరణం లాంటి కుటుంబ కథా చిత్రాల్లో నటించి అలరించారు. ఇక ఈ సినిమాలు కూడా సక్సెస్ ను అందుకోలేక పోయాయి.

Also read : ర‌మేష్ బాబు హీరోగా ఎంట్రీకి ముందు అంత క‌థ న‌డిచిందా..?

దాంతో రమేష్ బాబు జానపద చిత్రాల్లో సైతం నటించారు. అప్పట్లో ప్రముఖ దర్శకుడు సాగర్ డైరెక్షన్ లో రమేష్ బాబు ఓ జానపద చిత్రంలో నటించాల్సి ఉంది. కానీ అనుకోని కారణాలవల్ల ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత 1997లో ఎన్కౌంటర్ సినిమా లో సహాయ నటుడిగా కనిపించాడు. ఇదే రమేష్ బాబుకు ఆఖరి సినిమా అయింది. కథలు ఎంచుకోవడంలో విఫలం కావడమే రమేష్ బాబు కెరీర్ ను దెబ్బతీసిందని విశ్లేషకులు చెబుతుంటారు. అదేవిధంగా రమేష్ బాబుకు సైతం మిగతా హీరోల మాదిరిగా వరుస ప్లాపులు పడినప్పటికీ ఆయన మళ్లీ సినిమాల్లో నటించడానికి ఇష్టపడలేదని తెలుస్తోంది.

You may also like