నటులు అవ్వాలనుకుంటే ఎటువంటి పాత్ర చేయడానికి అయినా సరే ముందుండాలి. కొన్ని పాత్రలు చేయాలని కొన్ని లిమిట్స్ పెట్టేసుకుంటే హీరోలు అక్కడే ఉండిపోతారు. పెద్ద పెద్ద హీరోలు అవ్వలేరు. కొందరు విలన్ లు గా పరిచయమై తర్వాత హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమధ్య ఒక భాషలో హీరో అయినప్పటికీ ఇంకో భాషలో విలన్ గా నటించడానికి కూడా వెనకాడట్లేదు. నటుడు అన్న తర్వాత అన్ని తరహా పాత్రలు చేయాలని అందరూ ఆలోచనలో ఉన్నారు. ఇటీవల కాలంలో బాలీవుడ్ నుండి అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ వంటి హీరోలు టాలీవుడ్ లో విలన్స్ కనిపించారు. తమిళ హీరోలు అయినటువంటి విజయ్ సేతుపతి ఆర్య వంటి వాళ్ళు విలన్స్ గా చేసారు.
Advertisement
కొంతమంది హీరోలు మాత్రం తమ కెరియర్లో హీరోలుగా నటించారు తప్ప విలన్స్ గా చేయలేదు. కనీసం నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలు కూడా చేయలేదు. అలాంటి వాళ్ళలో అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొన్ని వందల సినిమాల్లో నటించిన ఆయన ఎప్పుడూ నెగిటివ్ రోల్ కి వెళ్ళలేదు. డైరెక్టర్ శంకర్ అమితాబ్ బచ్చన్ విలన్ గా చేయాలని ప్రయత్నం చేశారు. 2010లో వచ్చిన రోబో సినిమా అందరికీ తెలిసిందే ఈ సినిమాని అందరూ చూసే ఉంటారు.
Advertisement
Also read:
Also read:
ఈ సినిమాకి సంబంధించి ఒక విషయం బయటకు వచ్చింది అదేంటంటే ఈ మూవీలో విలన్ గా మొదట అమితాబ్ బచ్చన్ కి ఆఫర్ చేశారు. రజనీకాంత్ కి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారు అమితాబ్. సార్ మిమ్మల్ని ప్రేక్షకులు విలన్ గా అంగీకరించలేరు ఈ పాత్ర చేయకుండా ఉంటేనే మంచిదని రజినీకాంత్ అన్నారట ఈ మాటతో రోబో సినిమా చేయడానికి అమితాబ్ ఒప్పుకోలేదు. తర్వాత 2.0 లో విలన్ గా నటించబోతున్నాడని వార్తలు వచ్చాయి. అక్షయ్ కుమార్ అందులో విలన్ గా నటించడంతో అది రూమర్ అని తెలిసింది.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!