Home » కేవలం ఆ ఒక కారణం వల్లే సినిమాల మానేశా..! అసలు విషయాన్ని బయట పెట్టిన ప్రీతి జింగానియా…!

కేవలం ఆ ఒక కారణం వల్లే సినిమాల మానేశా..! అసలు విషయాన్ని బయట పెట్టిన ప్రీతి జింగానియా…!

by Mounika
Ad

ప్రీతి జింగానియా అంటే ఇప్పటి వారు అంతగా గుర్తుపట్టకపోవచ్చు.. కానీ 1999 లో విడుదలైన పవన్ కళ్యాణ్ తమ్ముడు చిత్రంలోని జాను అనగానే టక్కున గుర్తుకొచ్చేస్తుంది. ఈ చిత్రంలో జాను పాత్రలో ప్రీతి జింగానియా పవన్ కళ్యాణ్ స్నేహితురాలిగా, అతనికి తెలియకుండా రహస్యంగా ప్రేమించే ప్రేమికురాలుగా తన అందమైన అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది.  ఈ సినిమా అప్పటిలో ఘన విజయాన్ని అందుకుంది. ఆ తరువాత బాలకృష్ణ సరసన నరసింహనాయుడు చిత్రంలో కూడా నటించింది. ఈ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద  బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Advertisement

 ఆ తర్వాత ప్రీతి జింగానియా తెలుగులో నటించిన అధిపతి మరియు అప్పారావు డ్రైవింగ్ స్కూల్ వంటి చిత్రాలు నటించిన ఆ చిత్రాలు  అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీనితో ఈ భామకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. ఆ తర్వాత ఈమెకు తెలుగులో సరైన అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. కొంతకాలం తర్వాత   తెలుగులో తేజం అనే సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ లో నటించింది. ఇక 2007లో వచ్చిన విక్టోరియా నెం. 203 సినిమా తర్వాత మరే హిందీ సినిమాలోనూ ఈమె నటించలేదు. గత కొన్ని సంవత్సరాలుగా  సినిమాలకు దూరంగా వున్న ఈ భామ ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఫాస్‌ వెబ్‌ సిరీస్‌ ద్వారా ప్రీతి రీఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ ద్వారా  ప్రీతీ తాను సినిమాలకు దూరం అవడానికి కారణం ఏంటో తెలియజేసింది.

Advertisement

ఈ సందర్భంగా ప్రీతి మాట్లాడుతూ.. నేను ఆశించినట్లుగా నాకు పాత్రలు రాలేదు.. నాకు వచ్చిన పాత్రలతో నాకు అంతగా సంతృప్తిని ఇవ్వలేదు. సినిమాలో నాకు ప్రాధాన్యత ఉన్న పాత్ర చేయాలని ఉండేది. అలా అని సినిమా మొత్తం కేవలం నా రోల్ హైలైట్‌ అవ్వాలని  చెప్పడం లేదు. కథలో కనీసం నా పాత్రకు ఇంపార్టెన్స్ ఉండాలని కోరుకునే దాన్ని.  కానీ నాకు అటువంటి పాత్రలు రాలేదు. అలాంటప్పుడు నన్ను అభిమానించే అభిమానులను  నిరుత్సాహపరచడం ఎందుకని సినిమాలకు దూరం అయ్యాను.

అవిధంగా హిందీ సినిమాలలో నటించడం మానేసాను.  కానీ పలు ప్రాంతీయ భాషల్లో నటించడమే కాకుండా, కొన్ని ఈవెంట్లు మరియు షోస్ ఇలా ఎన్నో చేశాను. కాబట్టి నేను సినిమాలకు దూరంగా ఉన్నాననే ఫీలింగ్ నాకు కలుగలేదు. కానీ బాలీవుడ్‌ చిత్రాల్లో నటించడాన్ని బాగా మిస్‌ అయ్యాను.  ఇప్పుడు మళ్ళీ తిరిగి సినిమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

నిత్యామీనన్‌ ఇంట విషాదం.. ఒక శకం ముగిసిందంటూ భావోద్వేగపూరిత పోస్ట్‌

sitara : చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార..! ఇంతకీ ఏం చేసిందంటే..?

ఎన్టీఆర్-అల్లు అర్జున్ పోటీ పడనున్నారా..?

 

Visitors Are Also Reading