Home » ఎన్టీఆర్-అల్లు అర్జున్ పోటీ పడనున్నారా..?

ఎన్టీఆర్-అల్లు అర్జున్ పోటీ పడనున్నారా..?

by Anji
Ad

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు పోటాపోటీగా విడుదలైతే అభిమానుల హడావిడి మామూలుగా ఉండదు. ఇప్పుడు అంటే.. బిజినెస్ ఈక్వెషన్స్ కారణంగా పోటీ కాస్త తగ్గిందనే చెప్పాలి. కానీ అప్పట్లో అయితే చిరంజీవి, బాలయ్య లాంటి పెద్ద హీరోల సినిమాలు చాలా సందర్బాల్లో పోటాపోటీగా ఒకే రోజు విడుదలయ్యేవి. ఇప్పుడు ఇద్దరూ పెద్ద హీరోల సినిమాలు ఒకే సమయంలో విడుదలవ్వడం చాలా రేర్ సందర్భంలో జరుగుతోంది. 

Advertisement

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోలుగా మారిన ఎన్టీఆర్, అల్లు అర్జున్ కి సంబంధించిన సినిమాలు ఒకే నెలలో రానున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ 2024 ఏప్రిల్ లో విడుదల కానుండగా.. అదే సమయంలో సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న పుష్ప 2 కూడా ఏప్రిల్ నెలలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. వాస్తవానికి పుష్ప మూవీ షూటింగ్ ప్రారంభమై చాలా కాలం అవుతున్నప్పటికీ వివిధ కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ఆ మధ్య విడుదలైన గ్లింప్స్ మినహా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో బన్ని అభిమానులు ఒకింత నిరాశకు గురవుతున్నారు.

Advertisement

తొలుత డిసెంబర్ విడుదలకు ప్లాన్ చేసిన పుష్ప2 మూవీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అది సాధ్యమయ్యే ఛాన్స్ లేదు. ఏప్రిల్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.  దేవర షూటింగ్ మాత్రం బ్రేక్ లేకుండా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీలో కొరటాల అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ని భారీగానే ప్లాన్ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆచార్య వంటి డిజాస్టర్ మూవీ తరువాత వస్తున్న ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి తీరాలనే కసితో కొరటాల దేవర సినిమాని జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఆచార్య మూవీ తరువాత తీవ్ర విమర్శలు ఎదుర్కున్న కొరటాల శివ దేవర మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంటాడో లేదో వేచి చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

రాజకీయాల్లోకి రాబోతున్న అభిషేక్ బచ్చన్..? ఆ స్థానం నుంచే పోటీ..?

Visitors Are Also Reading