Home » హనుమాన్ సినిమా ఈవెంట్ కు ప్రభాస్ ఎందుకు రాలేదు? అసలు కారణం ఇదే!

హనుమాన్ సినిమా ఈవెంట్ కు ప్రభాస్ ఎందుకు రాలేదు? అసలు కారణం ఇదే!

by Srilakshmi Bharathi
Ad

నిన్న తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ప్రధాన అతిధిగా హాజరు అయ్యారు. అయితే.. మొదట్లో.. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ ముఖ్య అతిధిగా వస్తారు అంటూ ప్రచారం జరిగింది. కానీ.. ఇదేమి నిజం అవ్వలేదు. ఈ ఈవెంట్ కు చిరంజీవి గెస్ట్ గా వస్తారు అంటూ చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. అన్నట్లే.. మెగాస్టార్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ ఈవెంట్ ఘనంగా జరిగింది.

Advertisement

అయితే.. ఈ ఈవెంట్ కు ప్రభాస్ హాజరు కాకపోవడానికి కారణాలు వేరే ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. వాస్తవంగా.. వేరు వేరు కారణాల వలన ప్రభాస్ సలార్ ప్రమోషన్స్ లో కూడా సరిగ్గా పాల్గొనలేదు. ఇది ఇలా ఉంటె.. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ కే కోసం ఆయన తన లుక్ ని మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆయన హనుమాన్ ఈవెంట్ కు హాజరు అయితే ఆ లుక్ రివీల్ అయ్యే అవకాశం ఉంటుంది.

Advertisement

Here's why 'Salaar' star Prabhas failed to cast his vote

సినిమా రిలీజ్ వరకు ప్రభాస్ లుక్ ను సీక్రెట్ గా ఉంచనున్నారని తెలుస్తోంది. అందుకోసమే ప్రభాస్ అటు సాలార్ ప్రమోషన్స్ లో కానీ, హనుమాన్ ఈవెంట్ కి హాజరు కాలేదని తెలుస్తోంది. మరోవైపు హనుమాన్ సినిమా బిగ్ హిట్ అవుతుంది అని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. హనుమాన్ సినిమాకు ఇప్పటికే మల్టీప్లెక్స్ లలో భారీగానే స్క్రీన్స్ దక్కాయి. అయితే.. సింగల్ స్క్రీన్స్ లో మాత్రం ఆశించినన్ని దక్కలేదు. ఈ సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ భారీ స్థాయిలో ఉంటాయని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading