ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎన్నికల సందర్భంగా పార్టీ నాయకులందరూ కూడా ప్రచారాన్ని మొదలుపెట్టేసారు. ఇదిలా ఉంటే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బాటలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా రాజశ్యామల యాగం చేపట్టారు. చంద్రబాబు నాయుడు ఉండవల్లి లోని నివాసంలో రాజశ్యామల యాగం చేశారు. మూడు రోజులపాటు నారా చంద్రబాబునాయుడు సతీసమేతంగా రాజ శ్యామల యాగాన్ని చేస్తున్నారు. యాగాలు, హోమాలు చంద్రబాబు నాయుడు ఎన్నికలని చేపట్టారు. మొదటిరోజు పూజా కార్యక్రమాలు యాగక్రతువు లో చంద్రబాబు నాయుడు భువనేశ్వరి పాల్గొన్నారు.
మొత్తంగా మూడు రోజులు యాగం జరిగింది. మొదటి రోజు ఏం చేశారంటే, 50 మంది రుత్వికులు నిర్వహణలో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు పూజలు క్రతువులు నిర్వహించారు. ఆఖరి రోజున పూర్ణాహుతితో యాగం ముగిసింది. కెసిఆర్ కూడా ఇదే తరహాలో యాగాలు చేశారు. చంద్రబాబు నాయుడు యాగం చేయడం చర్చనీయాంశంగా మారింది. మన పురాణాలలో రాజసూయ యాగం, రాజశ్యామల యాగాల గురించి ప్రస్తావన ఉంది. రాజ్యలక్ష్మి వరించాలని విజేతగా నిలవాలని ఈ రెండు యాగాలని కూడా చేస్తూ ఉంటారు.
Advertisement
Advertisement
Also read:
Also read:
సూయం అంటే శాశ్వతం. రాజుని శాశ్వతంగా ఉండేటట్టు చేసేదే రాజసూయ యాగం. విజయాన్ని అందుకోవాలని శత్రువులు క్షమించాలని సార్వభౌమాదికరం సిద్ధించాలని ఈ రాజశ్యామల యాగాన్ని చేస్తారు. రాజసూయ యాగం ధర్మరాజు తో శ్రీకృష్ణుడు చేయించారు. మహాభారతంలో సభ పర్వంలోనే ఇది ఉంటుంది, శత్రు క్షయాన్ని కీర్తిని విజయాన్ని సిద్ధింపచేస్తుంది. కనుక ఈ యాగాన్ని చేయాలని శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పారు. రాజసూయ యాగం చేయడం చాలా పెద్ద క్రతువు. ఏడాది అంతా చెయ్యొచ్చు. లేదంటే మండలం రోజులు అంటే 41 రోజులు చేయొచ్చు. 21 రోజులు, 16 రోజులు, మూడు రోజులు కూడా ఈ యాగాన్ని చేస్తారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!