Home » అయోధ్య రామ మందిర్ ఉత్సవాలకు ప్రభాస్, ఎన్టీఆర్ ఎందుకు దూరంగా ఉన్నారు? వెళ్లేందుకు వెళ్ళలేదు అంటే?

అయోధ్య రామ మందిర్ ఉత్సవాలకు ప్రభాస్, ఎన్టీఆర్ ఎందుకు దూరంగా ఉన్నారు? వెళ్లేందుకు వెళ్ళలేదు అంటే?

by Srilakshmi Bharathi

రామజన్మ భూమి అయోధ్యకు ఎట్టకేలకు రాములొరొచ్చిన సంగతి తెలిసిందే. బాల రాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించారు. అభిజిత్ ముహుర్తం 12.29 నిమిషాలకు ప్రాణప్రతిష్ట జరిగింది. ప్రధాని మోడీ ఈ పూజలో పాల్గొనగా అనేక సినీ, రాజకీయ సెలెబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. టాలీవుడ్ లో కూడా పలువురు హీరోలకు ఈ వేడుకలో పాల్గొనడానికి ఆహ్వానం అందింది. కానీ, కొందరు టాలీవుడ్ సెలెబ్రిటీలు వెళ్లగా, ప్రభాస్ మరియు జూనియర్ ఎన్టీఆర్లు మాత్రం వెళ్ళలేదు. వీరిద్దరూ ఎందుకు వెళ్ళలేదు అనేది ఇప్పుడు చూద్దాం.

జనవరి 22 న అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు, ఉన్నతాధికారులకు, దౌత్యవేత్తలకు, పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు అందిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా మొత్తం ఏడూ వేల మందికి ఆహ్వానాలు వెళ్లాయి. అయితే ఆ ఆహ్వానాన్ని అందుకుని అయోధ్య రాముడిని దర్శించడానికి చాలా మందే అయోధ్యకు వెళ్లారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన కుమారుడు అభిషేక్ బచ్చన్ తో సహా అయోధ్య రాముడి వద్దకు వెళ్లారు.

కంగనా, అక్షయ్, రిషబ్ శెట్టి, రణబీర్ కపూర్, అలియా, అజయ్ దేవగన్, సంజయ్, కత్రినా కైఫ్, సన్నీ డియోల్.. ఇలా బాలీవుడ్ నుంచి చాలా మందే వెళ్లారు. ఇక రజినీకాంత్ కూడా వెళ్లి సందడి చేసారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, భార్య సురేఖ, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ లు కూడా వెళ్లారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ లకు ఆహ్వానం అందినా వీరు వెళ్ళలేదు. ప్రభాస్ రాజాసాబ్, కల్కి 2898 ఏడీ షూటింగ్ లలో చిక్కుకుని ఉండడంతో ప్రభాస్ వెళ్లలేదని తెలుస్తోంది. ఇటీవల జరిగిన జయంతి కార్యక్రమానికి కూడా ప్రభాస్ అందుకే వెళ్లలేకపోయారు. నలభై కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చినా.. ఆ అయోధ్యరాముడిని ఆయన కళ్లారా దర్శించుకోలేకపోయారు. ఇక యంగ్ టైగర్ కూడా దేవర సినిమాకు సంబంధించి ఓ మేజర్ పార్ట్ షూటింగ్ లో బిజీగా ఉండడంతో అయోధ్యకు వెళ్లలేకపోయారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading