Home » Krishna, Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణకి తన పిల్లలలో మహేష్ బాబు మీదే ఎక్కువ ప్రేమ అట ఎందుకంటే

Krishna, Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణకి తన పిల్లలలో మహేష్ బాబు మీదే ఎక్కువ ప్రేమ అట ఎందుకంటే

by Sravya
Ad

Krishna, Mahesh Babu :  సూపర్ స్టార్ కృష్ణ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. కృష్ణ ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఎంతోమంది అభిమానుల హృదయాలని గెలుచుకున్నారు కృష్ణ కి తన కొడుకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. కృష్ణ గారంటే కూడా మహేష్ కి చాలా ఇష్టం.

mahesh-babu-and-krishna-pics

Advertisement

కృష్ణ ఆయనకి పుట్టిన మిగతా పిల్లలందరికంటే కూడా కృష్ణకి మహేష్ బాబు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం ఉంటుందట. సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించారు. కృష్ణ పోషించిన చాలా పాత్రలు చరిత్రలో నిలిచిపోయాయి ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు సినిమాలో ఆయన పోషించిన పాత్ర చరిత్రలో ఎపిక్ గా ఉండిపోయింది.

కృష్ణ పేరు ఎత్తగానే అందరికీ అదే గుర్తుకొస్తుంది కూడా. కృష్ణ చాలామంది హీరోలుని దర్శకుల్ని ప్రోత్సహించి అవకాశాలని ఇచ్చేవారు. ఇండస్ట్రీలో చాలామంది గౌరవిస్తూ ఆయనకి కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండేవారు. కృష్ణ పర్సనల్ లైఫ్ లో కి వచ్చేస్తే ఆయనకి మొత్తం ముగ్గురు కూతుళ్లు ఇద్దరు కొడుకులు ఉన్నారు. అందరికంటే చిన్నవాడైన మహేష్ బాబు అంటే కృష్ణకి ఎంతో ఇష్టం సినిమా షూటింగ్లో ఎప్పుడు హడావిడిగా గడిపిన కృష్ణ తన పిల్లలతో ఎక్కువ సేపు గడపలేదు. మహేష్ బాబు పుట్టిన తర్వాత నుండి సినిమాలో చేస్తూనే పిల్లలతో గడపడానికి కృష్ణ ఎక్కువ ఆసక్తి చూపించారు.

Also read:

Advertisement

మిగతా పిల్లలు అందరూ స్కూల్ కి వెళ్లడం వలన మహేష్ బాబు ఇంట్లో ఒక్కడే ఉండేవారట దాని వలన కృష్ణ అతనితో సమయాన్ని గడపడానికి అయ్యేదట. తెలియకుండానే కృష్ణకి మిగతా పిల్లల కంటే ఎక్కువ ఇష్టం మహేష్ మీద ఏర్పడింది. దాని వలన మహేష్ బాబుని వీలు దొరికినప్పుడల్లా తనతో పాటు షూటింగ్లోకి కూడా తీసుకువెళ్లిపోయేవారు. సినిమా వాతావరణాన్ని మహేష్ బాబుకి అలవాటు చేశారు. ఇలా మొత్తం మీద తన తర్వాత హీరోగా ఎదిగే సత్తా మహేష్ బాబుకి మాత్రమే ఉందని కృష్ణ గమనించారు. మహేష్ బాబుకి సినిమాల మీద ఇంట్రెస్ట్ కలిగే విధంగా కృష్ణ చేస్తారు. అందువలన కృష్ణకి మహేష్ బాబు అంటే ఎంతో ఇష్టం, కృష్ణ గారు అంటే కూడా మహేష్ బాబుకి అమితమైన ప్రేమ ఉంది. మిగిలిన పిల్లలు అందరికంటే మహేష్ బాబుని ఇష్టపడే వారట పైగా చిన్న కొడుకు కావడంతో సహజంగా చిన్నపిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading