నిన్న ఆసియా కప్ లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. చివరి వరకు వచ్చిన ఈ మ్యాచ్ లో ఇంకా రెండు బంతులు ఉన్నాయి అనగా.. పాండ్య అద్భుతమైన సిక్స్ కొట్టి ఇండియాను గెలిపించాడు. అయితే ఈ సిక్స్ తర్వాత స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది అని చెప్పాలి. ఇక అక్కడే ఉన్న బీసీసీఐ సెక్రెటరీ జై షా కూడా ఇండియా విజయాన్ని ఎంజాయ్ చేసారు.
Advertisement
కానీ అదే సమయంలో ఆయన పక్కన ఉన్న ఒక్కరు మన జాతీయ జెండాను ఆయనకు ఇస్తుండగా.. ఆయన దానిని తీసుకునేందుకు నిరాకరించాడు. ఇది కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. దాంతో నిన్న మనపై ఓడిన పాకిస్థాన్ జట్టుతో పాటుగా మన జెండాను తీసుకొని జై షాను కూడా ట్రోల్ అనేది చేస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్. జై షా ఒక్క దేశ ద్రోహి అనే రేంజ్ లో ఈ ట్రోల్స్ అనేవి సాగుతున్నాయి.
Advertisement
అయితే జై ఎందుకు మన ఫ్లాగ్ అనేది తీసుకోలేదు అని చాలా మందికి అర్ధం కావడం లేదు. దాని వెనుక పెద్ద కారణం ఉంది. అదేంటంటే.. జై షా మన బీసీసీఐలో సెక్రెటరీ పదవితో పాటుగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రెసిడెంట్ గా కూడా కొనసాగుతున్నాడు. కాబట్టి ఈ ఆసియా కప్ లో అన్ని జట్లను ఆయన సమానంగా చూడాలి. అందుకే జై షా ఫ్లాగ్ అనేది తీసుకోలేదు.
ఇవి కూడా చదవండి :