Home » ఛీ.. ఛీ..రకుల్ మరీ అంత దారుణంగా ఎందుకు చేస్తోంది.. కారణం..!!

ఛీ.. ఛీ..రకుల్ మరీ అంత దారుణంగా ఎందుకు చేస్తోంది.. కారణం..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

రకుల్ ప్రీత్ సింగ్.. ఈ హీరోయిన్ అంటే తెలియని వారు ఉండరు. కెరటం అనే సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సందీప్ కిషన్ తో చేసిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ రకుల్ కి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఆ సినిమా అనంతరం నాన్నకు ప్రేమతో, అలాగే కరెంటు తీగ, ధ్రువ వంటి సినిమాల్లో అగ్ర హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఈ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేసి అక్కడ కూడా మంచి పేరును సంపాదించుకుంది. టాలీవుడ్, కోలీవుడ్ మాత్రమే కాకుండా బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా వరుస అవకాశాలు అందుకొని బాలీవుడ్ ప్రేక్షకులను కూడా మెప్పించింది రకుల్.

Advertisement

ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన ఒక వార్త అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. అదేంటంటే అప్పట్లో ఎంతో బిజీ హీరోయిన్ గా ఉన్న రకుల్ ప్రస్తుతం సినిమా ఆఫర్లు లేక చాలా అయోమయంలో ఉన్నట్లు తెలుస్తోంది. రకుల్ తన సినిమాకి దాదాపు రెండు కోట్లకు పైగా పారితోషికం తీసుకునేది.కానీ ఇప్పుడు రెమ్యూనరేషన్ విషయం లో చాలా మార్పులు చేసుకుందని టాక్ వినిపిస్తోంది. సాధారణంగా సెలబ్రిటీలు ఒక ఒప్పందం ప్రకారం భారీ పారితోషికాన్ని రెండు, మూడు వాయిదాల్లో తీసుకుంటారు. అయితే ప్రస్తుతం రకుల్ మాత్రం అలా ఒకేసారి తీసుకోకుండా ఏ రోజుకి ఆ రోజే డైలీ కాల్షీట్స్ ప్రకారం రెమ్యునరేషన్ ని తీసుకునే స్థాయికి వచ్చిందని అంటున్నారు.

Advertisement

ఇలా ఈమె ఒక రోజు షూటింగ్ లో పాల్గొంటే దాదాపు మూడు లక్షల వరకు పారితోషికాన్ని తీసుకుంటుందని పెద్ద ఎత్తున వార్తలు ఈమె పై వైరల్ అవుతున్నాయి. అయితే రకుల్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ విషయంలో వస్తున్న వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు. కానీ ఈ వార్తలు మాత్రం ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే రకుల్ ప్రీత్ సింగే స్వయంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

also read:

Visitors Are Also Reading