Home » బుమ్రా స్థానంలో సిరాజ్ ఎందుకు తుది జట్టులోకి వచ్చాడో తెలుసా..?

బుమ్రా స్థానంలో సిరాజ్ ఎందుకు తుది జట్టులోకి వచ్చాడో తెలుసా..?

by Azhar
Ad

భారత పేసర్ బుమ్రా.. ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2022 తర్వాత సౌత్ ఆఫ్రికా పర్యటన నుండి విశ్రాంతి అనేది తీసుకున్న బుమ్రా.. ఆ తర్వాత తిరిగి ఇంగ్లాండ్ పర్యటన కోసం జట్టులో కలిసాడు. ఈ క్రమంలో టెస్ట్ మ్యాచ్ కు కెప్టెన్సీ వచించిన బుమ్రా.. తర్వాత జరిగిన టీ20 అలాగే వన్డే సిరీస్ లలో అద్భుతంగా రాణించాడు. కానీ కెప్టెన్ గా మాత్రం విఫలమయ్యాడు. ఇదిలా ఉంటె.. ఈరోజు టీం ఇండియా ఇంగ్లాండ్ జట్టుతో మూడు వన్డేల సిరీస్ లో ఆఖరి వన్డే అనేది ఆడుతుంది. కానీ ఈ మ్యాచ్ లో బుమ్రా ఆడటం లేదు.

Advertisement

ఇంగ్లాండ్ లో దుమ్ము లేపుతున్న బుమ్రా జట్టులో లేకుండా.. మొహ్మద్ సిరాజ్ ఆ స్థానంలో తుది జట్టులోకి వచ్చాడు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో తన చివరి వన్డే ఆడిన సిరాజ్ ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా తుది జట్టులోకి రావడం అనేది అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇదే సమయంలో అర్షదీప్ సింగ్ ను ఎందుకు జట్టులోకి తీసుకోలేదు. శార్దూల్ ఠాకూర్ ను ఎందుకు పక్కన పెట్టారు అనే ప్రశం వస్తుంది. అయితే బుమ్రాను ఎందుకు పక్కకు పెట్టాను అనే విషయం అపి ఏ క్లారిటీ లేదు. ఈ మధ్య కాలంలో బీసీసీఐ చేస్తున్న విధానంలోనే బుమ్రాకు రెస్ట్ అనేది ఇచ్చి ఉండవచ్చు.

Advertisement

ఇక అర్షదీప్ సింగ్ ఆరోగ్యం బాగాలేదు అని బీసీసీఐ మొదటి వన్డే ప్రారంభం సమయంలోనే ప్రకటించింది. అప్పటినుండి ఇప్పటివరకు అతను ఇంకా కోలుకోలేదు. అందుకే అర్షదీప్ సింగ్ ను తుది జట్టులోకి తీసుకోలేదు అని తెలుస్తుంది. అయితే అర్షదీప్ సింగ్ టీ20 సిరీస్ లోని చివరి మ్యాచ్ లో ఆడిన విషయం తెలిసిందే. ఇక శార్దూల్ ఠాకూర్ టెస్ట్ మ్యాచ్ లో ఎలా విఫలమయ్యాడు అనేది అందరికి తెలిసిందే. అందుకే అతడిని జట్టులోకి తీసుకోలేదు అని తెలుస్తుంది. అయితే బుమ్రా స్థానంలో వచిహ్న సిరాజ్.. తాను వేసిన మొదటి ఓవర్ లోనే రెండు వికెట్లు తీయడం గమనార్హం.

ఇవి కూడా చదవండి :

ముంబై వదిలేయడంతో షాక్ లోకి పాండ్య..!

కోహ్లీని సపోర్ట్ చేసిన జొకోవిచ్.. ఎలా అంటే…?

Visitors Are Also Reading