Home » కోహ్లీని సపోర్ట్ చేసిన జొకోవిచ్.. ఎలా అంటే…?

కోహ్లీని సపోర్ట్ చేసిన జొకోవిచ్.. ఎలా అంటే…?

by Azhar

విరాట్ కోహ్లీ అంటే ఓ బ్రాండ్ అనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు బ్రాండ్ కొంత సమస్యలో ఉంది. దశాబ్దకాలంగా క్రికెట్ ను ఏలుతూ… పరుగుల వరద పారిస్తూ వచ్చిన విరాట్… ఇప్పుడు ఫేమ్ కోల్పోయాడు. గత అంతర్జాతీయ క్రికెట్ లో మూడేళ్ళుగా సెంచరీ చేయలేకపోతున్న విరాట్ కోహ్లీ కెరియర్ ముగింపువైపుగా వెళ్తుంది అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక విరాట్ కోహ్లీని భారత జట్టు నుండి తప్పించాలి అనే వాదన ఎక్కువ అవుతుంది. ఈ క్రమంలో కొంతమంది ప్లేయర్స్ కోహ్లీకి మద్దతుగా నిలిస్తున్నారు. ఇప్పుడు లిస్ట్ లోకి జొకోవిచ్ కూడా వచ్చాడు.

అయితే తాజాగా విరాట్ కోహ్లీకి మద్దతుగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసాడు. అందులో కోహ్లీని ని కెరియర్ లో ఎన్ని అద్భుతాలు ఉన్నాయి. అలాంటి అద్భుతాలు మీలాంటి ఆటగాళ్లు మాత్రమే చేయగలరు. మీరు చేసినవి చూస్తే.. ఎప్పుడు గర్వంగానే ఉంటుంది. ఇంకా చాలా సమయం అనేది ఉంది. నువ్వు మళ్ళీ ఫేమ్ లోకి వస్తావ్ అని నేను నమ్ముతున్నాను” అని పోస్ట్ చేసాడు. అయితే ఈ పోస్ట్ లో పీటర్సన్ చెప్పినదానికి మద్దతుగా నిలిచాడు. టెన్నిస్ సూపర్ స్టార్ జొకోవిచ్. పీటర్సన్ పోస్ట్ కు లైక్ కొట్టాడు. ఇప్పుడు ఇదే వైరల్ అవుతుంది. ఇక జొకోవిచ్, కోహ్లీకి మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే.

ఇక అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పటికే 70 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ.. 71వ సెంచరీ అనేది చేయలేకపోతున్నాడు. ఐపీఎల్ లో కూడా విఫలమైన కోహ్లీ… తర్వాత కొంత రెస్ట్ అనేది తీసుకొని.. మళ్ళీ భారత జట్టుతో కలిసి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళాడు. అక్కడ మూడు ఫార్మట్స్ లో మ్యాచ్ లు ఆడి.. అన్నింట్లో విఫలమయ్యాడు. అయితే ఈ పర్యటన తర్వాత టీం ఇండియా విండీస్ టూర్ వెళ్లనుంది. అక్కడ విండీస్ జట్టుతో వన్డే, టీ20 సిరీస్ లు ఆడనుంది. కానీ ఈ రెండు సిరీస్ ల నుండి కోహ్లీకి మళ్ళీ విశ్రాంతి అనేది ఇచ్చింది బీసీసీఐ.

ఇవి కూడా చదవండి :

ఉమ్రాన్ కెరియర్ నాశనం చేస్తున్న బీసీసీఐ..!

బాబర్ మెసేజ్ పై స్పందించిన విరాట్ కోహ్లీ..!

Visitors Are Also Reading