సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇస్తే అవకాశాలు రావడం కష్టమే. కానీ బ్యాగ్రౌండ్ ఉంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అయితే అవకాశాలు వచ్చినా స్టార్ హీరోగా ఎదగాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. దాంతో పాటూ అదృష్టం కూడా కలిసి రావాలి. టాలీవుడ్ లో కొంతమంది హీరోలు ఎంతో బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీల నుండి వచ్చినా స్టార్ హీరోలుగా ఎదగలేకపోయారు. అలాంటి హీరోల లిస్ట్ లో సుమంత్ కూడా ఉంటాడు. సుమంత్ అక్కినేని వారసుడుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. అగ్రహీరో నాగేశ్వరరావు మనవడిగా నాగార్జున మేనల్లుడిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.
ఇవి కూడా చదవండి: విజయం సాధించాలంటే చాణక్య చెప్పిన ఈ 4 మార్గాలు అనుసరించండి..!
Advertisement
సుమంత్ తండ్రి యార్లగడ్డ కూడా ఒకప్పుడు నిర్మాతగా రాణించారు. సుమంత్ ఎంట్రీ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా జరిగింది. వర్మ ఇప్పుడు ఫ్లాప్ డైరెక్టర్ గా మారాడు కానీ అప్పట్లో స్టార్ డైరెక్టర్ గా బిజీగా ఉన్నాడు. ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు సుమంత్ యూత్ లో చాలా క్రేజ్ సంపాదించుకున్నాడు. దాంతో పవన్ మహేశ్ లకు పోటీ ఇస్తాడని అనుకున్నారు. కానీ అలా జరగకుండా స్టార్ హీరో రేంజ్ ను అందుకోలేకపోయాడు. సుమంత్ మొదటి సినిమా ప్రేమకథకు నాగ్ నిర్మాతగా వ్యవహరించగా ఆర్జీవీ దర్శకత్వం వహించాడు.
Advertisement
ఇవి కూడా చదవండి:నాగార్జున ఎంతో ఇష్టంగా నటించిన సినిమా అట్టర్ ఫ్లాప్ అని మీకు తెలుసా..?
ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఆర్జీవీ ప్రత్యక్షంగా కారణమైతే టైటానిక్ సినిమా పరోక్షంగా కారణం అయ్యిందట. ఈ విషయాన్ని సుమంత్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ప్రేమకథ సినిమా క్లైమాక్స్ లో హీరోహీరోయిన్ లు చనిపోతారు. అది వర్కౌట్ అవ్వదని సుమంత్ ముందుగానే చెప్పాడట. కానీ ఆర్జీవీ వినకుండా టైటానిక్ చూసినప్పుడు నాకు కన్నీళ్లు వచ్చాయి. కానీ హీరోయిన్ ఒక్కరే బ్రతికుండటం నాకు నచ్చలేదని చెప్పాడట.
దాంతో ప్రేమకథ సినిమాలో ఇద్దరినీ చంపేయగా ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందని సుమంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. అదేవిధంగా మేనమామ నాగ్, తాత ఏఎన్ఆర్ తో కలిసి సినిమాలు చేయడం కూడా తాను చేసినతప్పని చెప్పాడు. నాగ్ తో స్నేహమంటే ఇదేరా సినిమా చేయగా అందులో తమను స్నేహితులుగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారని అన్నాడు. ఎఎన్ఆర్ తో కలిసి పెళ్లిసంబంధం సినిమా చేశానని ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యిందని అన్నాడు. అంతే కాకుండా తన కెరీర్ లో 20సినిమాలు వదులుకున్నానని అది పెద్ద తప్పు అని చెప్పాడు.
ALSO READ : నాగార్జున ఎంతో ఇష్టంగా నటించిన సినిమా అట్టర్ ఫ్లాప్ అని మీకు తెలుసా..?