ఇటీవలి సంవత్సరాలలో, ప్రపంచవ్యాప్తంగా షాపింగ్ కేంద్రాలలో ఫుడ్ కోర్టులు బాగానే డెవలప్ అవుతున్నాయి. ఫాస్ట్‌ఫుడ్ ఫ్రాంచైజీల నుండి ఫైన్ డైనింగ్ వరకు రకరకాలుగా ఫుడ్ కోర్ట్ లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా షాపింగ్ మాల్స్ లో వీటి హంగామా చెప్పక్కర్లేదు. అయితే.. మీరెప్పుడైనా గమనించారా? ఏ షాపింగ్ మాల్ లో అయినా ఫుడ్ కోర్ట్ టాప్ ఫ్లోర్ లో ఉంటుంది. దీనికి కల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
ఫుడ్ కోర్టులు సాధారణంగా కస్టమర్ల దృష్టిని మళ్లిస్తాయి. షాపింగ్ మీద నుంచి వారి ధ్యాస ఫుడ్ మీదకి వెళ్లిపోవచ్చు. దీనితో షాపింగ్ వదిలేసి తినేసి వెళ్ళిపోయేవారు ఉంటారు. ఇలా జరగకుండా ఉండడానికి ఫుడ్ కోర్ట్స్ ను ఆఖరి ఫ్లోర్ లో పెట్టేస్తూ ఉంటారు. మరొక కారణం ఏంటంటే.. తినడానికి వచ్చిన వారు అన్ని ఫ్లోర్స్ లోను షికారు చేయవలసి ఉంటుంది. దీనితో.. తెలియకుండానే ఎవరికైనా ఏదైనా నచ్చితే కొనేస్తూ ఉంటారు. అలా.. రెండు రకాలుగా ఫుడ్ కోర్ట్ లను టాప్ ఫ్లోర్ లో పెట్టడం వలన ఉపయోగం ఉంది.
Advertisement
మరొక కారణం సేఫ్టీ. కష్టమర్ల సేఫ్టీ ని దృష్టిలో ఉంచుకుని కూడా ఫుడ్ కోర్ట్ లను టాప్ ఫ్లోర్ లో పెడుతూ ఉంటారు. టాప్ లెవెల్‌లో ఫుడ్ కోర్ట్‌లను ఉంచడం వల్ల వంట జరిగే ప్రదేశాల్లో పొరపాటున వచ్చే ప్రమాదాల వలన కష్టమర్లను రక్షించడం కోసం ఇలా చేస్తుంటారు. ఇంకా ఫుడ్ కోర్ట్స్ పెట్టడానికి చాలా ఎక్కువ ప్లేస్ కావాలి. టాప్ ఫ్లోర్స్ లోనే ఫుడ్ కోర్ట్స్ ను పెట్టడానికి ఇది కూడా ఒక కారణం.
మరిన్ని..
మహిళల్లో ఈ 5 లక్షణాలు ఉంటే కుటుంబం నాశనం అవుతుందట..3వది ముఖ్యం !
BRO : “బ్రో” మూవీ ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే.. పవన్ ఫ్యాన్స్ కు ఇక పండగే
“నువ్వు నా కెరీర్ ముగించావు” విరాట్ కోహ్లీపై జహీర్ ఖాన్ సంచలనం !