చాలామంది దిష్టి తగలకుండా కాళ్ళకి నల్ల దారాన్ని కట్టుకుంటారు. నల్లధారాన్ని కట్టుకుంటే దిష్టి తొలగిపోవడమే కాకుండా పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. చిన్నపిల్లలకి కూడా దిష్టి తగలకుండా ఉండాలని కాళ్ళకి నల్ల దారాన్ని కడతారు. అయితే ఈ మూడు రాశుల వారు కాళ్ళకి నల్లదారం కట్టుకుంటే అదృష్టం ఐశ్వర్యం కలుగుతుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కొంతమంది ఒక కాలికి కానీ రెండు కాళ్ళకి కానీ నల్ల దారాన్ని కట్టుకుంటారు. నిజానికి కంటి చూపుకే చాలా శక్తి ఉంటుంది. కొంతమంది కంటిచూపు పడితే చెడు జరుగుతుంది.
Advertisement
అందుకే అలాంటి దిష్టి చిన్నపిల్లలకి తగలకూడదని నల్ల దారాన్ని, తాడుని కడుతూ ఉంటారు. కొంతమందికి కాళ్లలో నొప్పి ఉంటుంది. నడిచేటప్పుడు నొప్పి వస్తుంది. అలాంటివారు కూడా కాళ్ళకి తాడును కట్టుకుంటారు. మెడ, నడుముకి కూడా చాలామంది నల్ల తాళ్ళు కట్టుకుంటారు. శని దేవున్ని పూజించేటప్పుడు కూడా నల్లతాడుని కట్టుకుంటూ ఉంటారు. దాంతో రాహు, కేతు దోషాలు దరిచేరకుండా ఉంటాయి. నల్లతాడుని కట్టే ముందు శని దేవుడి మంతాన్ని 21సార్లు జపించడం చాలా మంచిది. అప్పుడు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి.
Advertisement
ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్లు మంగళవారం నాడు ఈ తాడును కట్టుకుంటే చాలా మంచిది. అప్పుడు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. అప్పుడు ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి వీలవుతుంది. నల్ల తాడుని కట్టే ముందు 9 ముడులు వేసి ఆ తర్వాత వారికి కట్టడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. రోజు రుద్ర గాయత్రీ మంతాన్ని జపిస్తే ఇంకా మేలు కలుగుతుంది. పండిత శాస్త్రం ప్రకారం ధనస్సు, తుల, కుంభ రాశి వారు నల్ల తాడు కట్టుకుంటే ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. . వారికి బాగా కలిసి వస్తుంది. కానీ వృశ్చిక, మేష రాశి వాళ్లు కట్టుకోకూడదు. వీరికి ఈ తాడు కట్టుకోవడం వలన ఇబ్బందులు కలుగుతాయి. ఆర్థికంగా కలిసి రాదు.
ఇవి కూడా చదవండి
Ram Charan – Upasana : రాంచరణ్ కూతురు పేరు ‘క్లింకారా కొణిదెల’ అసలు ఈ పేరుకి అర్థం ఏమిటంటే!
‘సైతాన్’ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించిన ఈ నటి బ్యాక్ గ్రౌండ్ ఇదే ?
ఉదయం నీళ్లు తాగేటప్పుడు ఇలా చేస్తే డబ్బుకు లోటు ఉండదు…!