సాధారణంగా అప్పుడే పుట్టిన పసిపిల్లలు బాగా ఏడుస్తూ ఉంటారు. వారికి ఎంత ఏడ్చిన కన్నీళ్లు మాత్రం రావు. ఈ విషయాన్ని మీరు ఎప్పుడైన గమనించారా.. ఇప్పుడు ఆలోచిస్తున్నారు కదు.. మరి కన్నీళ్లు ఎందుకు రావో ఇప్పుడు చూద్దాం.. ఇప్పటికే దీనిపై చాలామంది శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు. వీరి పరిశోధనలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.
Advertisement
also read:సుధీర్ పోస్టర్ ను హత్తుకుంటున్న నాని.. గొప్ప నటుడు అంటూ కితాబు..!!
ఒక వ్యక్తి ఏడ్చినప్పుడల్లా ఒక ప్రత్యేకమైన వాహికా నాళం గుండా నీళ్లు వస్తాయి. కానీ అప్పుడే పుట్టిన పిల్లల్లో ఇది పూర్తిగా అభివృద్ధి చెంది ఉండదు. అది పెరగడానికి కొంత సమయం పడుతుంది. అందుకే అప్పుడే పుట్టిన శిశువులకు ఎంత ఏడ్చినా కన్నీళ్లు అనేవి రావు. ఈ వాహిక ద్వారం అభివృద్ధి చెందిన తర్వాతే ఏడ్చినప్పుడు కన్నీరు రావడం ప్రారంభమవుతుంది. నవజాత శిశువులు ఎక్కువగా ఏడుస్తారని సాధారణంగా వారికి కన్నీళ్లు రావడానికి రెండు వారాలు పడుతుందని శిశు వైద్యులు చెబుతుంటారు.
Advertisement
ఇందులో కొంతమంది పిల్లలకు రెండు వారాల కంటే ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు అని అంటున్నారు. కొంతమంది పిల్లలకు రెండు నెలల వరకు కూడా పట్టవచ్చని తెలియజేస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం కంటి ఎగువ కనురెప్పకు దిగువన బాదం ఆకారపు గ్రంధి ఉంటుంది. దీని నుండే కన్నీళ్లు కారుతాయి. ఆ గ్రంధి కళ్లలో తేమను గ్రహిస్తుంది. దీనివల్ల కళ్ళ కదలిక తేలిక అవుతుంది. దీని ద్వారానే కళ్ళలో నుంచి నీళ్లు వస్తాయని నిపుణులు అంటున్నారు.
also read: