Home » సుధీర్ పోస్టర్ ను హత్తుకుంటున్న నాని.. గొప్ప నటుడు అంటూ కితాబు..!!

సుధీర్ పోస్టర్ ను హత్తుకుంటున్న నాని.. గొప్ప నటుడు అంటూ కితాబు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బుల్లితెరపై ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు సుడిగాలి సుదీర్. ఇక జబర్దస్త్ షో ఆయన జీవితాన్ని మార్చేసిందని చెప్పవచ్చు.. అలాంటి సుడిగాలి సుదీర్ మెజీషియన్, కమెడియన్, యాంకర్, సింగర్ గా ఈ విధంగా మల్టీ టాలెంట్ తో బుల్లితెరపై ఒక స్టార్ హీరోకి ఉండే రేంజ్ ను సంపాదించుకున్నారు.. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలని తత్వంతో సుధీర్ ఉంటారని చెప్పవచ్చు.. అలాంటి సుదీర్ అంటే న్యాచురల్ స్టార్ నానికి చాలా ఇష్టమట.

Advertisement

also read:ఎన్టీఆర్ నిర్ణయాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒప్పుకుంటాడా ?

ఆయన పోస్టర్ ను ఏకంగా గుండెలకు హాద్దుకొని ఆయన ప్రేమను చూపించారు.. సుడిగాలి సుదీర్ అంటే ఏమిటో నానికి చాలా తెలుసు. ఎందుకంటే సుదీర్ ఒకసారి ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఉగాది జాతి రత్నాలు అనే కార్యక్రమాన్ని ప్రసారం చేశారు ఈటీవీ ఛానల్ లో. ఈ కార్యక్రమంలో సుధీర్, రష్మీ ఇంకా చాలామంది ఈటీవీ సెలబ్రిటీలతో పాటు స్పెషల్ గెస్ట్ గా సంగీత మరియు నాని వచ్చారు. ఈ షోకి నాని వచ్చి చాలా సందడి చేశారు. ఈ టైంలోనే సుధీర్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారట నాని.

Advertisement

సుధీర్ ఒక కమెడియన్ అనుకుంటాము కానీ ఆయన మల్టీ టాలెంటెడ్ అని, బుల్లితెరపై సుదీర్ లా క్రేజ్ తెచ్చుకోవడం మామూలు విషయం కాదని, సంవత్సరానికి ఒకటి, రెండు సినిమాల్లో మేము కనిపిస్తాము కానీ, సుధీర్ ప్రతిరోజు తన ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. ఆయనకు మా కంటే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారని, నిజంగా పాపులారిటీలో, ఫ్యాన్స్ లో సుధీర్ తో పోల్చుకుంటే ఒక్కోసారి మాది మాకే అసూయ కలుగుతుందని చెప్పారట నాని. ప్రస్తుతం నాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. దీంతో సుధీర్ అభిమానులు కూడా నానిని ఎంతో ఇష్టపడుతున్నారు. ఈ పోస్టర్ పై అనేక కామెంట్స్ కూడా చేస్తున్నారు.

also read:

Visitors Are Also Reading