తెలుగు చలన చిత్ర రంగంలో గుమ్మడిగా ప్రసిద్ది చెందిన గుమ్మడి వెంకటేశ్వరరావు దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా నటించాడు. ముఖ్యంగా ఆయన అతిచిన్నవయస్సులో ఎంతో భారమైన పరిణితికి మించిన పాత్రలు ధరించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. గుమ్మడి నటన జీవితానికి సంబంధించిన ఒకచిన్న ఉదాహరణ గురించి చెప్పాలంటే ఆయన నటించిన అర్ధాంగి సినిమాలో గుమ్మడికి భార్యగా శాంతకుమారి నటించింది. విచిత్రమేమిటంటే ఆమె గుమ్మడి కంటే ఎనిమిది సంవత్సరాలు పెద్దది. గుమ్మడికి పెద్దకొడుకుగా అక్కినేని నాగేశ్వరరావు నటించారు. గుమ్మడికంటే ఆ సమయానికి అక్కినేని వయస్సు మూడు సంవత్సరాలు ఎక్కువ. గుమ్మడికి చిన్న కొడుకుగా నటించిన జగ్గయ్య గుమ్మడి కంటే ఒక సంవత్సరం పెద్ద.
Advertisement
ఇలా తన కన్నా పెద్ద హీరోలకు తండ్రిగా, అన్నగా నటించి పెద్ద పాత్రలకు పెట్టింది పేరుగా గుమ్మడి నటన జీవితం కొనసాగింది. గుమ్మడికి సీనియర్ ఎన్టీఆర్‌కి మధ్యలో కొన్నేళ్లపాటు కోల్డ్ వార్ జరిగింది. వాస్తవానికి గుమ్మడి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నటుడు నాగయ్య ఆఫీస్‌లోనే ఒక రూమ్‌లో ఉండేవాడు. మొదటి రెండు సినిమాల వరకు అక్కడే ఆశ్రయం పొందాడు. ఇక ఆ తరువాత తన మకాం ఒక హోటల్ రూమ్‌కి మార్చుకున్నాడు. ఆ సమయంలో టీఎన్‌టీ వారి ఆఫీస్ ఎదురుగా సంగీత దర్శకుడు టీవీ రాజు ఒక హోటల్‌లో ఎన్టీఆర్ తో కలిసి ఉండేవారు. అక్కడ గుమ్మడితో ఎన్టీఆర్‌కి జరిగిన పరిచయం, చివరికీ తన సొంత చిత్రంలో గుమ్మడికి పిలిచి మరీ అవకాశం ఇచ్చే స్థాయికి ఎదిగింది.
Advertisement
Also Read : విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలబ్రెటీల భార్యలు..!
ఆ తరువాత చాలా సినిమాల్లో గుమ్మడి, ఎన్టీఆర్ కలిసి నటించారు. అక్కినేనికి ఎన్టీఆర్‌కి పోసగకపోవడం వారి మధ్య వివాదాలకు తావిచ్చింది. ఇక ఆ సమయంలో అక్కినేనితో ఎక్కువగా గుమ్మడి కనిపించేవాడు. దీంతో ఇది నచ్చని ఎన్టీఆర్ గుమ్మడిని దూరంగా పెట్టారు . గుమ్మడి ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి తన కుమార్తె పెళ్లికి రావాల్సిందిగా కోరినప్పటికీ కూడా ఎన్టీఆర్ వెళ్లలేదట. గుమ్మడి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడట. ఇక ఆ తరువాత కొద్ది రోజుల తరువాత అక్కినేని, ఎన్టీఆర్ కలిసిపోయి గుమ్మడి విషయంలో తాను చేసిన తప్పు గ్రహించి ఎన్టీఆర్ మరలా తన సినిమాల్లో అవకాశమిచ్చాడు. మొత్తానికి ఎన్టీఆర్, అక్కినేని కలయికతో గుమ్మడికి సినీ అవకాశాలు పెరిగిపోయాయనే చెప్పవచ్చు.
Also Read : ప్రస్తుత స్టార్ హీరోల కంటే సోగ్గాడికి ఎక్కువ ఆస్తులు ఉన్నాయట…! ఎన్ని వేల కోట్లు అంటే..?