Telugu News » Blog » విడాకుల‌తో కోట్ల‌కు ప‌డ‌గెత్తిన సెల‌బ్రెటీల భార్య‌లు..!

విడాకుల‌తో కోట్ల‌కు ప‌డ‌గెత్తిన సెల‌బ్రెటీల భార్య‌లు..!

by AJAY

సెలబ్రెటీలు పెళ్లి చేసుకోవడం విడాకులు తీసుకోవడం చాలా కామన్ గా వినిపిస్తూనే ఉంటుంది. ఇక పెళ్లి సమయంలో సెలబ్రెటీలు చాలా గ్రాండ్ గా… అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేసుకుంటారు. కోట్లు ఖర్చుపెట్టి బంధువులు స్నేహితుల మ‌ధ్య ఒక్క‌ట‌వుతారు.

Advertisement


అయితే విడాకుల సమయంలోనూ సెలబ్రెటీలు అదే రేంజ్ లో భరణం చెల్లించుకోవ‌డం జ‌రుగుతుంది. అలా ఇప్పటివరకు విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు తమ భార్యలకు ఎంత భరణం ఇచ్చారో ఇప్పుడు చూద్దాం..

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ మొదట రీనా ద‌త్తాను పెళ్లి చేసుకున్నారు. 2000 సంవత్సరంలో తన భార్యకు అమీర్ ఖాన్ విడాకులు ఇచ్చారు. విడాకుల సమయంలో అమీర్ ఖాన్ తన భార్యకు పదికోట్ల భరణించినట్టు సమాచారం. ఆ త‌ర‌వాత కిర‌ణ్ రావును పెళ్లి చేసుకున్న అమీర్ ఆమెకు కూడా విడాకులు ఇచ్చారు.

Advertisement

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ 2000 సంవత్సరంలో సృజాన్ ఖాన్ ను వివాహం చేసుకున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావ‌డంతో 2014లో వీళ్లు విడాకులు తీసుకున్నారు. విడాకుల సమయంలో హృతిక్ రోషన్ నుండి భార్య 400 కోట్ల మరణం డిమాండ్ చేసింది .

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ 2008 సంవత్సరంలో తన భార్య రిచా శ‌ర్మతో విడాకులు తీసుకున్నాడు. విడాకుల సమయంలో తన భార్యకు సంజ‌య్ ద‌త్ 8 కోట్ల భ‌ర‌ణం చెల్లించిన‌ట్టు సమాచారం.

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు అయిన‌ ప్రభుదేవా కూడా తన భార్యతో విడాకులు తీసుకున్నారు. ప్రభుదేవ తన భార్య రమాప్రభతో 2011లో విడాకులు తీసుకున్నారు. విడాకుల సమయంలో ప్రభుదేవా 25 కోట్ల భ‌ర‌ణంతో పాటు ఖరీదైన కార్లు, ఇల్లు ఇచ్చినట్టు సమాచారం.

ALSO READ : అయన ఎప్పుడో హింట్ ఇచ్చారు మనమే గుర్తు పట్టలేదు ! బాహుబలి 2 లో రాజమౌళి ఇచ్చిన హింట్ ఇదే..!