టాలీవుడ్ హీరోలలో ఒకరైన నితిన్ ప్రస్తుతం టైర్ 2 హీరోలలో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నాడు. 2002లో వచ్చిన జయం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. చిత్రం మూవీస్ బ్యానర్ పై అప్పట్లో ఫుల్ ఫామ్‌లో ఉన్న దర్శకుడు తేజ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అప్పట్లో చిత్రం, నువ్వు నేను వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో తేజ పేరు టాలీవుడ్‌లో మారుమ్రోగిపోయింది. తేజ సినిమాలు అంటే యూత్‌లో తిరుగులేని క్రేజ్ ఉండేది.
Advertisement
నువ్వు నేను హిట్ తరువాత తేజ జయం సినిమా తీశాడు. అప్పుడు నైజాంలో నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి టాప్ డిస్ట్రిబ్యూటర్‌గా ఉండేవారు. సుధాకర్ రెడ్డి కొడుకును హీరోగా పరిచయం చేస్తూ సినిమా తీస్తుండడం.. అందులోనూ తేజ స్వీయ దర్శకత్వం హీరోయిన్ సదాతో పాటు అందరూ కొత్తవాళ్లే కావడంతో సినిమాపై మంచి ఆసక్తి ఏర్పడింది. ఇక ఆర్పీ పట్నాయక్ సాంగ్స్ విడుదలకు ముందే ఊపేశాయి. 2002 జూన్ 14న విడుదలైన ఈ సినిమా బడ్జెట్ రూ.2కోట్లు కాగా.. రూ.10 కోట్లకు పైగానే వసూలు చేసింది. బెస్ట్ విలన్‌గా గోపిచంద్, బెస్ట్ మేల్ కమెడీయన్‌గా సుమన్ శెట్టి, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా శ్వేత, వెళ్లవయ్యా వెళ్లు అంటూ హీరోయిన్‌కు డబ్బింగ్ చెప్పిన సింగర్ సునిత ఇలా మొత్తం నాలుగు అవార్డులను జయం కైవసం చేసుకుంది.
Also Read : బసవతారకం ట్రస్ట్ కోసం ఎన్టీఆర్ చేసిన చివరి సినిమా ఇదే..!
Advertisement
ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో సదా పదే పదే టేకులు తీసుకోవడంతో సీరియస్ అయిన తేజ ఆమెను కొట్టినట్టు వచ్చిన వార్తలు అప్పట్లో తీవ్రదుమారమే రేపాయి. పెద్ద వివాదం కూడా అయింది. తేజ తన సినిమాలో పదే పదే హీరోయిన్లపై చేయి చేసుకుంటాడన్న ప్రచారం జరిగింది. వారిని తాను కావాలని కొట్టను అని.. నటనలో భాగంగా ఒక్కోసారి అలా జరుగుతుందని తేజ తరువాత వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అంతకు ముందు నువ్వు నేను సినిమా సమయంలో హీరోయిన్ అనితపై చేయి చేసుకున్నారన్న ప్రచారం వినిపించింది.
జయం సినిమాలో తేజ చేయి చేసుకోవడంతో హీరోయిన్ సదా భోరున విలపిస్తే అప్పుడు హీరో నితిన్ ఆమెను ఓదార్చడంత పాటు తేజ పై ఫైర్ అయ్యాడని.. షూటింగ్‌కు కూడా రానని తేల్చిచెప్పాడన్న టాక్ కూడా బయటకొచ్చింది. షూటింగ్ పూర్తయిన తరువాత కూడా పాటలు ఎక్కువగా ఉన్నాయని.. రన్ టైమ్ ఎక్కువగా ఉందనే విషయంలో దర్శకుడు తేజకు, హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డికి కూడా వాదోపవాదాలే జరిగాయి. విడుదలకు ముందే వివాదాలతో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. తిరుగులేని బ్లాక్‌బాస్టర్ టాక్‌తో జయం నితిన్ కెరీర్‌లో ఓ మైలు రాయిగా నిలిచిపోయింది.
Also Read : ఆర్ఆర్ఆర్‌లో తారక్, చరణ్ హీరోలని శ్రియకు తెలియదట..!