Home » ఆర్ఆర్ఆర్‌లో తార‌క్‌, చ‌ర‌ణ్ హీరోల‌ని శ్రియ‌కు తెలియ‌ద‌ట‌..!

ఆర్ఆర్ఆర్‌లో తార‌క్‌, చ‌ర‌ణ్ హీరోల‌ని శ్రియ‌కు తెలియ‌ద‌ట‌..!

by Anji
Ad

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి అన‌గానే క‌థ విన‌కుండానే ఓకే చెప్పారు. ఆర్ఆర్ఆర్‌లో ఇద్దరు స్టార్ హీరోలున్నార‌ని తెలుసు. కానీ వారు రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ అని షూటింగ్ ప్రారంభ‌మ‌య్యేంత వ‌ర‌కు నాకు తెలియ‌దు అని చెప్పారు హీరోయిన్ శ్రియ‌. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్‌. ఇందులో అజ‌య్ దేవ‌గ‌ణ్ స‌తీమ‌ణి స‌రోజ‌నీ పాత్ర‌లో శ్రియ న‌టించారు. మార్చి 25న విడుద‌లైన ఈ చిత్రం విజ‌య‌వంతంగా దూసుకెళ్లుతుంది. బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డుల‌ను కొల్ల‌గొడుతూ క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. ఈ త‌రుణంలో తాజాగా శ్రియ ఆర్ఆర్ఆర్ విజ‌యంపై స్పందించారు.

Advertisement

ఆర్ఆర్ఆర్ విజ‌యం సాధించ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. ఓ గొప్ప చిత్రంలో మంచి పాత్ర ఇచ్చినందుకు రాజమౌళికి థాంక్స్ చెప్పారు. ఇక సినిమా చూశారా అని అడ‌గ్గా.. నేను ఇంకా ఆర్ఆర్ఆర్ సినిమా చూడ‌లేదు. సినిమా విడుద‌లైన స‌మ‌యంలో నేను ముంబైలో ఉన్నాను. అక్క‌డ టికెట్లు దొర‌క‌లేదు. ప్ర‌తీ థియేట‌ర్‌లో హౌస్‌పుల్ బోర్డులే క‌నిపించాయి. షూటింగ్ కోసం ఇప్పుడు బెంగ‌ళూరు వ‌చ్చాను. ఇక్క‌డ కూడా టిక్కెట్లు దొర‌క‌డం లేదు. క‌నీసం వ‌చ్చే వార‌మైనా టిక్కెట్లు దొరుకుతాయో చూడాల‌ని శ్రియ వెల్ల‌డించారు.

Advertisement

Also Read :  ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ : 2010లో రాజ‌మౌళి ఏబీఎన్ ఇంట‌ర్వ్యూ ఇప్పుడూ నెట్టింట్లో వైర‌ల్‌..!

ఇక ద‌ర్శ‌కుడు జ‌క్క‌న్న గురించి చెబుతూ.. ఛ‌త్ర‌ప‌తి సినిమాతో తొలిసారిగా రాజ‌మౌళి క‌లిసి ప‌ని చేసే అవ‌కాశం వ‌చ్చింది. నా కెరీర్‌లో సూప‌ర్ హిట్ చిత్రం అది. ఆ త‌రువాత రాజ‌మౌళితో క‌లిసి మ‌ళ్లీ ప‌ని చేయాల‌న ఎన్నో ఏండ్లుగా ఎదురుచూశాను. తాజాగా ఆర్ఆర్ఆర్‌లో అవ‌కాశ‌మొచ్చింది. మంచి పాత్ర పోషించే అవ‌కాశం వ‌చ్చింది. మ‌ళ్లీ రాజ‌మౌళి టీమ్ తో ప‌ని చేసే అవ‌కాశం వ‌స్తే త‌ప్ప‌కుండా ఆయ‌న సినిమాలో భాగం అవుతాను అని శ్రియా పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ క‌బ్జా మ్యూజిక్ స్కూల్ అనే పాన్ ఇండియా చిత్రాలతో పాటు అజ‌య్ దేవ్‌గ‌ణ్ దృశ్యం2లో న‌టిస్తోంది.

Also Read :  హీరో గోపీచంద్ నాన్న డైరెక్ట్ చేసిన సినిమాలు.

Visitors Are Also Reading