తెలుగు సీనియర్ నటుడు నరేష్ గుర్తించి చర్చించగానే అందరికీ ఠక్కున గుర్తుకొచ్చే పేరు పవిత్ర లోకేష్. వాస్తవానికి వీరిద్దరూ కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులే. కానీ వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి సహజీవనం కూడా చేస్తున్నారు. పెళ్లి అయితే చేసుకోలేదు. కానీ ఇద్దరూ కలిసే ఉంటున్నట్టు సమాచారం. అవన్ని పక్కకు పెడితే.. అసలు నరేష్ వల్లనే పవిత్రా లోకేష్ కి చాలా పేరు వచ్చింది.
Advertisement
తాను తెలుగులోచాలా సినిమాల్లో నటించినప్పటికీ ఎప్పుడూ కూడా ఆమెకు అంతగా పేరు రాలేదు. నరేష్ తో పరిచయం ఏర్పడినప్పటి నుంచి నరేష్ తో పాటు పవిత్రా లోకేష్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు. ఇక గూగుల్ లో తనే ట్రెండింగ్ టాపిక్ అయిపోయారు. మరోవైపు మీడియా కూడా పవిత్రపై ఫోకస్ పెంచేసింది. వాస్తవానికి పవిత్ర లోకేష్ ది కర్నాటక. ఆమె తండ్రి కన్నడ నటుడు. అందుకే తనకు చిన్నప్పటి నుంచే సినిమా రంగంపై ఆసక్తి ఏర్పడింది. తన తండ్రి మరణించిన తరువాత పొట్టకూటి కోసం పలు సినిమాలలో నటించింది పవిత్ర లోకేష్. ఓవైపు సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూనే.. మరోవైపు సివిల్స్ కి ప్రిపేర్ అయింది.
Advertisement
ఐఏఎస్ కావాలనేది తన లక్ష్యమట. కానీ తనకాళ్ల మీద తాను నిలబడేందుకు చిన్నతనం నుంచే వెండితెర, బుల్లితెర మీద నటించడం ప్రారంభించింది. 1994లోనే అంబరీష్ హీరోగా వచ్చిన మిస్టర్ అభిషేక్ అనే సినిమాలో నటించింది. కొన్నేళ్ల పాటు హీరోయిన్ గా నటించి ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయింది. సినిమాలలో బిజీగా అయిపోగానే సివిల్స్ ని వదిలేసింది. ఈ నేపథ్యంలోనే కన్నడ, తెలుగులో మంచి ఆఫర్స్ రావడంతో ఇక పూర్తి స్థాయిలో సినిమాలకే సమయం కేటాయించింది. పవిత్ర భర్త సుచేంద్ర ప్రసాద్ టీవీ సీరియర్ నటుడు. వీరిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అంతకు ముందే పవిత్రకు ఒక పెళ్లి జరిగి విడాకులు తీసుకుంది. సుచేంద్రతో గొడవలు రావడంతో వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు. నరేష్ తో ప్రేమలో పడిన తరువాత ఆ తరువాత ఏం జరిగిందనేది అందరికీ తెలిసిందే. ఇటీవల తాము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు నరేష్, పవిత్రలు ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Also Read : అర్జున్ రెడ్డి సినిమాను చేతులారా మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?