అక్కినేని నాగార్జున గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు. 50 పదుల వయసు దాటినప్పటికీ అదే అందంతో యంగ్ గా కనిపిస్తూ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఫిదా చేస్తుంటాడు.
తన అద్భుతమైన నటనకుగాను కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. నాగార్జున సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే వెంకటేష్ చెల్లెలు అయినటువంటి లక్ష్మీతో ఇరు కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. వీరిద్దరికి నాగచైతన్య జన్మించాడు. ఇక కొన్ని రోజులకి ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. దీంతో నాగచైతన్య నాగార్జున వద్దనే ఉన్నాడు. ఇక విడాకులు అనంతరం నాగార్జున అమలను వివాహం చేసుకున్నాడు.
Advertisement
Advertisement
వీరిద్దరికి అఖిల్ జన్మించాడు. ఇక నాగార్జునతో విడాకుల అనంతరం లక్ష్మీ కూడా శరత్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యింది. ఇక నాగచైతన్య బాధ్యతలన్నీ వెంకటేష్ దగ్గరుండి మరి చూసుకున్నాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇక ప్రస్తుతం నాగచైతన్య అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఇక నాగార్జున ఇంట్లో ఎలాంటి ఫంక్షన్లకైనా లక్ష్మి పాల్గొంటుంది.
ఇవి కూడా చదవండి
- రానా కారణంగా త్రిష, ప్రభాస్ పెళ్లి క్యాన్సిల్ అయిందా ?
- హైదరాబాద్ లో బీఫ్ పెట్టడం లేదని పాక్ క్రికెటర్ల రచ్చ ?
- అక్షర్ పటేల్ సంచలన పోస్ట్.. నాకు అన్యాయం చేశారని ఫైర్ ?