Home » ఆటోకు 3చక్రాలు ఎందుకుంటాయి..4ఎందుకు పెట్టరంటే..?

ఆటోకు 3చక్రాలు ఎందుకుంటాయి..4ఎందుకు పెట్టరంటే..?

by Sravanthi
Ad

సాధారణంగా ఏదైనా ప్రాంతాలకు వెళ్లాలంటే పట్టణాల్లో ఉండే ధనవంతులైతే కార్లు ఇతర బైకులు వేసుకొని వెళ్తారు. కానీ మధ్యతరగతి పేద ప్రజలకు అందుబాటులో ఉండేవి మూడు చక్రాల ఆటోలు మాత్రమే. ఎన్నోసార్లు మీరు ఆటోలో ఎక్కి ఉంటారు. మరి ఆటో కి మూడు చక్రాలు ఎందుకు ఉంటాయి.. నాలుగు ఎందుకు ఉండకూడదో ఒక్కసారి కూడా ఆలోచించలేదు కదూ.. దాని గురించి తెలుసుకుందాం.. అయితే ఆటోలు తయారు చేసే కంపెనీలు నాలుగు చక్రాల తో కన్నా మూడు చక్రాలతో వాహన ఖర్చు తగ్గుతుంది.

Advertisement

అలాగే తక్కువ ఇంజనీరింగ్ వర్క్ కూడా సరిపోతుంది. అలాగే నాలుగు చక్రాల వాహనం కంటే మూడు చక్రాల వాహనం చిన్నదిగా ఉంటుంది. అలాంటి టైంలో ఎటువంటి ఇరుకు ప్రాంతాల్లో ప్రయాణం చేయడానికైనా అనువుగా ఉంటుంది. ముఖ్యంగా నిత్యం రద్దీగా ఉండే పట్టణంలో ఆటోలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అలాగే మూడు చక్రాల వాహనానికి ఇంధన వినియోగం కూడా తక్కువగా ఉంటుంది. సాధారణంగా మూడు చక్రాల వాహనాన్ని ప్రయాణికులను తరలించేందుకు లేదా సరుకు రవాణాకు ఉపయోగిస్తారు.

Advertisement

అలాంటి టైంలో అన్ని రకాల వినియోదారులు త్వరగా ముందుకెళ్లవచ్చు. అయితే కొన్ని పరిస్థితుల్లో నాలుగు చక్రాల వాహనంతో పోలిస్తే మూడు చక్రాల వాహనం అణువుగా ఉండదు అనిపిస్తుంది. మంచు ప్రాంతాల్లో కార్నర్ ప్రదేశాల్లో ఆటో డ్రైవ్ చేయడం కాస్త కష్టం. అంతేకాకుండా మూడు చక్రాల వాహనాల్లో ప్రయాణం చేస్తే చార్జీలు కూడా తక్కువగా ఉంటాయి. దీనివల్ల పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది.

మరికొన్ని ముఖ్య వార్తలు :

Visitors Are Also Reading