Home » Guntur Kaaram: మరోసారి కాపీ కొట్టాడు అంటూ థమన్ పై ట్రోల్స్..

Guntur Kaaram: మరోసారి కాపీ కొట్టాడు అంటూ థమన్ పై ట్రోల్స్..

by Bunty

ప్రిన్స్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఇప్పుడు ఓ సినిమా తెలుగు ఎక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. నిన్న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ తో పాటు… గ్లిoమ్స్ కూడా రిలీజ్ చేసింది చిత్రం బృందం.

ఈ సినిమాలో పూజ హెగ్డే మొదటి హీరోయిన్గా నటిస్తుండగా… శ్రీ లీల సెకండ్ హీరోయిన్గా నటిస్తోంది. త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబోలో ఇది మూడో సినిమా. ఇక ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. ఈతరణంలోనే తాజాగా మరోసారి తమన్ పై కాపీ ఆరోపణలు వచ్చాయి.

గుంటూరు కారం నుంచి విడుదల చేసిన ఫస్ట్ గ్లిoప్స్… కు మ్యూజిక్ తమన్ కంపోజ్ చేశాడు. అయితే దీనికి వాడిన బిజిఎం… దేవిశ్రీ నాన్నకు ప్రేమతో సినిమాకు ఇప్పటికే వాడేసారట. అంటే దేవిశ్రీ వాడిన బిజిఎంను ఇప్పుడు తమన్ వాడినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నాన్నకు ప్రేమతో సినిమాలో క్లైమాక్స్లో అరబిక్ స్టైల్ లో ఓ సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ కు దేవిశ్రీ ఇచ్చిన ట్యూన్ ను ఇప్పుడు గుంటూరు కారం కోసం తమన్ వాడినట్లు.. నెటిజన్లు ఆరోపణలు చేస్తున్నారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

పాక్ లోనూ ధోని క్రేజ్ మామూలుగా లేదుగా.. అభిమానులు ఏం చేశారంటే

Mahesh Babu : “గుంటూరు కారం”తో వచ్చేసిన ప్రిన్స్ మహేష్

కోట్లు ఇస్తామని చెప్పినా… పొగాకు యాడ్ చేయలేదు – సచిన్ టెండూల్కర్..

Visitors Are Also Reading