ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1968 జులై 02వ తేదీన జన్మించిన గౌతమీ తాడిమల్ల గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేశారు. తన పెదనాన్న కుమారుడు నిర్మించిన దయామయుడు సినిమాలో మొట్టమొదటిగా గౌతమి నటించారు. అనంతరం తమిళ సినిమ పరిశ్రమలో ఆరంగ్రేటం చేసి రజినీకాంత్, కమల్ హాసన్‌వంటి స్టార్ హీరోల సరసన నటించారు. తెలుగులో కంటే తమిళంలోనే ఆమె అగ్రతారగా గౌతమి దూసుకెళ్లిన హీరోయిన్. రేవతి, అమలా, భానుప్రియ వంటి హీరోయిన్లకు గట్టి పోటీగా నిలిచారు.
Also Read : ఒకే ఒక్క డ్రెస్ తో సినిమా అంతా కంప్లీట్! అలాంటి 8 సినిమాలు!
Advertisement
కేవలం సినిమాల్లో మాత్రమే కాదు సీరియల్లో కూడా ఆమె నటించారు. తమిళ ఛానెల్‌లో ప్రసారమైన ఇందిరా అనే ధారావాహిక ఆమె ప్రధాన పాత్రలో నటించారు. ఒక తమిళ టాక్ షో లో కాఫీ విత్ అను అని సన్ టీవీలో ప్రసారమైన ప్రోగ్రామ్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 2000 సంవత్సరంలో సినిమా పరిశ్రమలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆరంగేట్రం చేసారు. అప్పటికే ఆమె తన మొదటి భర్త అయినా సందీప్ భాటియాకు విడాకులు విచ్చేశారు.
Advertisement
హీరోయిన్ గౌతమి-సందీప్ జంట 1998వ సంవత్సరంలో పెళ్లి చేసుకుని 1999 సంవత్సరంలో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. 2000వ సంవత్సరంలో కమల్‌హాసన్‌కు దగ్గరైన హీరోయిన్ గౌతమి అతనితో తరువాత కాలంలో లివింగ్ ఇన్ రిలేషన్ షిప్ కొనసాగించారు. 2004 నుంచి 2016 సంవత్సరం వరకు వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోకుండా సహజీవనం సాగించారు. అయితే ఈ 12 సంవత్సరాల సమయంలో వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఆ తరువాత కొన్నాళ్లకు తనను కమలహాసన్ ఆర్థికంగా, శారీరకంగా బాగా వాడుకున్నాడని.. తనకు రూపాయి బిళ్ల కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా ముందట కంటతడి పెట్టుకున్నారు. అప్పట్లో ఆమె చేసిన వ్యాఖ్యలు భారతదేశ వ్యాప్తంగా హాట్ టాఫిక్‌గా మారాయి.
ఇకపోతే హీరోయిన్ గౌతమి పెళ్లి చేసుకున్న మొదటి భర్త భారతీయ ఫైనాన్షియల్ అనలిస్ట్ కాగా.. ఇతను ప్రతిరోజు బుల్లితెరపై కనిపిస్తూనే ఉంటారు. అలా ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన ఫైనాన్షియల్ అనలిస్ట్ వదిలేసి హీరో వెనుకాల పడి చివరికీ ఒంటరిగా మిగిలపోయారు గౌతమి. 1999వ సంవత్సరంలో సుబ్బలక్ష్మీ అనే ఓ బిడ్డకు జన్మనిచ్చిన గౌతమి ఇప్పుడు ఆమె కోసమే జీవిస్తున్నానని అని చెబుతున్నారు.
Also Read : అలలు చెక్కిన శిల్పాలు ఎక్కడో తెలుసా..?