Home » తండ్రి చేసిన మోసం వల్లే ఆర్తి అగర్వాల్ రోడ్డున పడిందా ? ప్రేమ పెళ్లిని అడ్డుపడింది ఎవరు ?

తండ్రి చేసిన మోసం వల్లే ఆర్తి అగర్వాల్ రోడ్డున పడిందా ? ప్రేమ పెళ్లిని అడ్డుపడింది ఎవరు ?

by Sravya
Ad

నటి ఆర్తి అగర్వాల్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆర్తి అగర్వాల్ అందరికీ పరిచయమే. ఆమె గతంలో చాలా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. చాలామంది టాప్ హీరోల పక్కన ఆర్తి అగర్వాల్ నటించి మంచి పేరును తెచ్చుకున్నారు. ఎంతో మంది హృదయాలని గెలుచుకున్నారు. తన నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది ఆర్తి అగర్వాల్ ప్రేమ కథ సినిమాలలో కాకుండా మాస్ హీరోల పక్కన కూడా అద్భుతంగా నటిస్తూ ఈమె మంచి పేరు తెచ్చుకుంది. ఏ పాత్రలకైనా కూడా ఈమె బాగా సెట్ అయ్యేది. ఆర్తి అగర్వాల్ అమెరికాలో పుట్టారు అక్కడే ఆమె చదువుకున్నారు అయితే ఒకసారి గుజరాత్ వాళ్లు అందరూ కూడా ఫారెన్ లో న్యూ ఇయర్ వేడుకల్ని జరుపుకున్నారు.

tarun-and-aarthiagawal-love

Advertisement

అక్కడికి బాలీవుడ్ కి సంబంధించిన ప్రముఖులు వెళ్లారు సునీల్ శెట్టి కూడా వెళ్లారు. ఆర్తి అగర్వాల్ అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక అక్కడితో ఆమె దశ తిరిగిపోయింది అని చెప్పొచ్చు. చదువుతో బిజీగా ఉండే ఆర్తి అగర్వాల్ జీవితంలో పెద్ద మలుపు చోటుచేసుకుంది సునీల్ శెట్టి ఆమెని నటించొచ్చు కదా అని చెప్పడంతో ఆమె సినిమాలో నటించాలని అనుకున్నారు. తండ్రి కూడా డబ్బులు బాగా వస్తాయని అనుకున్నారు. సినీ కెరియర్ ని నెమ్మదిగా స్టార్ట్ చేశారు. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఆఫర్ వచ్చింది వెంకటేష్ సరసన నటించిన మంచి పేరు తెచ్చుకున్నారు మొదటి సినిమాలోనే ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ రా నటించడంతో అందరూ షాక్ అయిపోయారు. తర్వాత ఆర్తి అగర్వాల్ బాగుందని సురేష్ బాబు తరుణ్ తో నువ్వు లేక నేను లేను సినిమాలో ఆఫర్ ఇచ్చారు.

Advertisement

Also read;

ఆమె ఆ సినిమాలో కూడా అద్భుతంగా నటించింది మంచి హిట్ ని కొట్టింది తర్వాత పలు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి అయితే ఇది ఎక్కువ కాలం కొనసాగలేదు తరుణ్ తో ప్రేమలో పడింది ఆర్తి అగర్వాల్. తరుణ్ తల్లి ఒప్పుకోకపోవడంతో పెళ్లి చేసుకోలేదు. ఆర్తి అగర్వాల్ షూటింగ్ టైంలో తన తండ్రి సెట్స్ మీద కూర్చుని అందరినీ ఇబ్బంది పెట్టే వారట దర్శకనిర్మాతల్ని కూడా విసిగించడంతో ఆర్తి అగర్వాల్ ని ఈ సినిమాలో పెడితే ఇబ్బంది అవుతుందని దర్శక నిర్మాతలు ఆమెను దూరం పెట్టారు. ఏది ఏమైనా కొన్నాళ్ళకి ఆమెకి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అయినప్పటికీ కూడా వచ్చిన పాత్రని చేస్తూ ఉండేది తర్వాత సర్జరీ చేయించుకోవడం ఆ ప్రభావం వలన ఆర్తి అగర్వాల్ ఇబ్బందులు ఎదుర్కొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading