Home » Rx 100 మూవీలో హీరోయిన్ ఛాన్స్ ని చేతులారా మిస్ చేసుకున్న నటి ఎవరో తెలుసా..?

Rx 100 మూవీలో హీరోయిన్ ఛాన్స్ ని చేతులారా మిస్ చేసుకున్న నటి ఎవరో తెలుసా..?

by Mounika
Ad

 నిజ జీవితంలో జరిగిన సంఘటనను కథాంశంగా   తీసుకొని 2018లో విడుదలైన ఆర్ఎక్స్ 100 బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లలో  సెన్సెషన్ సృష్టించింది. అప్పటి వరకు హీరోయిన్ అంటే పాజిటివ్ కోణంలో చూపించే దర్శకులు.. ఈ సినిమాతో హీరోయిన్ని నెగటివ్ షేడ్ లో చూపించి  ఒక్కసారిగా అందర్నీ ఆశ్చర్యపరిచారు. మొదటి సినిమాతోనే అజయ్ భూపతి అందరి దృష్టిని ఆకర్షించాడు.

Advertisement

ఇక ఈ సినిమాలో హీరో హీరోయిన్గా కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పటికీ కూడా ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్   నెగిటివ్ షేడ్ లో చేసిన పాత్రను ప్రేక్షకులు మర్చిపోలేరు. బోల్డ్ గా , ప్రేమించిన అబ్బాయిని మోసం చేసిన క్యారెక్టర్ లో పాయల్ పాత్రకే ప్రాణం పోసింది. అయితే ఈ సినిమాలో పాయల్ కంటే ముందు మరో హీరోయిన్ ని సంప్రదించటం జరిగిందట.  

 ఆమె ఇంకెవరో కాదు.. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన నటి  నందితా శ్వేత. ఇక అడపాదడపా   కొన్ని చిత్రాలు నటించిన నందిత శ్వేతాకు ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా అంతా ఆదరణ పొందలేకపోయింది. అయితే ఈ భామకు  మొదట ఆర్ఎక్స్ 100 సినిమా ఛాన్స్ వచ్చిందట. కానీ ఆమె ఈ పాత్రకు నో  చెప్పడం జరిగిందట . ఎందుకంటే.. హీరోయిన్ బోల్డ్ సీన్స్ లో యాక్ట్ చేస్తే.. ఆ తర్వాత చేయబోయే చిత్రాలలో ఎలాంటి పాత్రలు వస్తాయో అనే భయంతో ఆ సినిమాను రిజెక్ట్ చేసిందట నందిత శ్వేత.

Advertisement

ప్రస్తుతం నందిత శ్వేత  హిడింబ అనే మూవీలో నటిస్తుంది. ఓంకార్ తమ్ముడు అశ్వీన్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇక హిడింబ సినిమా ప్రమోషన్స్ లో నందిత శ్వేత స్వయంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది.  హిడింబ సినిమా  జూలై 20 రిలీజ్ కి సిద్ధంగా ఉంది.  ఈ ప్రమోషన్‌ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో ఆర్‌ఎక్స్‌ 100 సినిమా గురించి చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమాలో పాయల్‌ తన పాత్రకు  వంద శాతం న్యాయం చేసిందని తెలిపింది నందిత శ్వేత.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

ఈ సీరియల్ హీరోల రెమ్యునరేషన్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోడం పక్కా..!

డిస్కో శాంతి దగ్గర శ్రీహరి తీసుకున్న మాట ఏంటి ? రెండు సార్లు పెళ్లి ఎందుకు ?

టాలీవుడ్ కమెడియన్స్ రోజుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా ?

Visitors Are Also Reading