Home » రవితేజని కిందకి లాగే ప్రయత్నం.. ఎందుకంటే..?

రవితేజని కిందకి లాగే ప్రయత్నం.. ఎందుకంటే..?

by Anji
Ad

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘ధమాకా’ సినిమా తాజాగా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ తో విజయవంతంగా దూసుకెళ్తోంది. ధమాకా ఏకంగా రూ. 100 కోట్లు వసూలు చేసిందంటూ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా పోస్టర్ విడుదల చేశారు. అదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. ముఖ్యంగా ఓ మీడియా సంస్థ వారు ధమాకా సినిమా సక్సెస్ అయిన మాట వాస్తవమే. కానీ రూ.65 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ ని మాత్రమే ధమాక వసూలు చేసిందనీ.. అయితే చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం రూ.101 కోట్లు కలెక్షన్ చేసిందంటూ హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. 

Advertisement

ఈ వార్త తెలుసుకున్న రవితేజ అభిమానులు ఆ మీడియా సంస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. రవితేజను కిందికి లాగే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఏకి పారేస్తున్నారు. మరోవైపు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రూ. 100 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసిందని అధికారికంగా లెక్కలు చూపించడంతో పాటు వాటికి సంబంధించిన ఐటీ కూడా చెల్లించారని రవితేజ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. రవితేజ ఓ సామాన్య పరిస్థితుల నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వ్యక్తి అని.. కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని ఇలా తొక్కేసేందుకు ప్రయత్నించకూడదన్నారు. ధమాకా సినిమా రూ.100 కోట్లు కలెక్షన్ చేసిందని.. మరో 20 కోట్ల వరకు కలెక్షన్లు నమోదు చేసే అవకాశం ఉందని అభిమానులు పేర్కొంటున్నారు. మొత్తానికి ధమాకా మూవీ రూ.120 కోట్ల కలెక్షన్లను నమోదు చేయబోతుందని నమ్మకంతో ఉన్నారు రవితేజ అభిమానులు. 

Advertisement

Also Read :  తెలుగు స్టార్ హీరోల ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Manam News

రవితేజ పై చిన్న చూపు చూడకుండా ఆయనను గౌరవించడం నేర్చుకోవాలని ఆ మీడియా సంస్థకి సూచించారు అభిమానులు. అయితే  రవితేజ ధమాకా మూవీ కేవలం జనవరి 12 వరకే థియేటర్లలో రన్ కానున్నట్టు తెలుస్తోంది. జనవరి 11న కొన్ని థియేటర్లలో విజయ్ దళపతి నటించిన వారసుడు, అజిత్ నటించిన తెగింపు చిత్రాలు విడుదల కానున్నాయి. జనవరి 12న నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమా విడుదల కాబోతుండడంతో ఆరోజు రవితేజ ‘ధమాకా’ కి సంబంధంచిన థియేటర్లని ఖాళీ అయి వీరసింహారెడ్డి సినిమా రన్ కానున్నట్టు తెలుస్తోంది. జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా కూడా విడుదల కాబోతుంది. అందులో రవితేజ కూడా నటించిన విషయం తెలిసిందే. ధమాకా థియేటర్లు ఖాళీ అయినా కానీ జనవరి 13న మళ్లీ వాల్తేరు వీరయ్య సినిమాతో పండక్కి రవితేజ నటించిన సినిమా ఉండబోతుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read :  మహానటి చిత్ర యూనిట్ అన్యాయం చేసిందంటూ బోరుమని ఏడ్చిన జమున..!!

 

Visitors Are Also Reading